AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushanth : ‘బండి తియ్’ అంటున్న అక్కినేని హీరో.. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ నుంచి ప్రమోషనల్ సాంగ్

అక్కినేని కుర్రహీరో సుశాంత్ ఇటీవల సెకండ్ హీరో అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో సుశాంత్ సెకండ్ హీరోగా

Sushanth : 'బండి తియ్' అంటున్న అక్కినేని హీరో.. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' నుంచి ప్రమోషనల్ సాంగ్
Sushanth
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2021 | 9:50 AM

Share

Ichata Vahanamulu Nilupa Radu: అక్కినేని కుర్రహీరో సుశాంత్ ఇటీవల సెకండ్ హీరో అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో సుశాంత్ సెకండ్ హీరోగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరో వైపు ఇలా నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు సోలో హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ”ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే సినిమా చేస్తున్నాడు సుశాంత్. ఎస్. దర్శన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి  హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్లు. సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమా కథ ఒక బైక్ చుట్టూ తిరుగుతుందని పోస్టర్స్,  టైటిల్ చేస్తే అర్ధమవుతుంది. ఇటీవల సెన్సార్‌కు వెళ్లిన ఈ సినిమాకు  ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. ఆగస్టు 27న ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ‌లో స్పీడ్ పెంచింది.

ఈ క్రమంలోనే తాజాగా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ నుంచి అదిరిపోయే ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘బండి తియ్’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పాటను అక్కినేని నాగచైతన్య సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రవీణ్ లక్కరాజు ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేశారు. సురేష్ గంగుల సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్ తన స్టైల్‌లోఆలపించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా  థ్రిల్లర్‌గా ”ఇచ్చట వాహనములు నిలుపరాదు” రూపొందింది. ఇక ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాను రవిశంకర్ శాస్త్రి – ఏక్తా శాస్త్రి – హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..

Andamaina Lokam: ఆకట్టుకునే ప్రేమ కథతో రానున్న అందమైన లోకం.. త్వరలోనే రెగ్యులర్ షూట్

Honey Trapping: బ్లాక్ మెయిల్ కాదది.. బ్లూ మెయిల్.. పిచ్చెక్కి తిరిగే కుర్రబ్యాచ్‌ బీ-కేర్‌ఫుల్.. వల్లో పడ్డారా ఇక అంతే..