Mega Family: మెగాస్టార్ చిరంజీవి ఇంట శ్రావణ శోభ.. మెగా ఫ్యామిలీ నాలుగు తరాల ఫోటో వైరల్

Mega Family Four Generations: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటో ఇపుడు వైరల్ అవుతుంది. శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మెగా ఫ్యామిలీలో నాలుగు తరాలకు..

Mega Family: మెగాస్టార్ చిరంజీవి ఇంట శ్రావణ శోభ.. మెగా ఫ్యామిలీ నాలుగు తరాల ఫోటో వైరల్
Mega Family
Follow us
Surya Kala

|

Updated on: Aug 21, 2021 | 10:04 AM

Mega Family Four Generations: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటో ఇపుడు వైరల్ అవుతుంది. శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మెగా ఫ్యామిలీలో నాలుగు తరాలకు చెందిన ఆడవాళ్లు లక్ష్మీదేవికి పూజ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో చిరంజీవి తల్లి అంజనాదేవి, భార్య సురేఖ తో పాటు.. కోడలు ఉపాసన.. శ్రీజ కూతురు నివృతి ఉన్నాయి. చిరంజీవి ఇంట్లో ఏ పండగనైనా అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఇక మహిళలు అత్యంత ప్రాముఖ్యత ఉన్న వరలక్ష్మి అమ్మవారిని మెగాఫ్యామిలీలోని ఆడవాళ్లు కూడా అత్యంత భక్తి శ్రద్దలతో పూజించారు. వ్రతం నోచుకున్నారు. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా అంజనాదేవి, సురేఖ, ఉపాసనలు అలంకరించుకున్న. ఇక శ్రీజ కూతురు నివృతి చీర కట్టుకుని ముద్దులొలుకుతూ పదహారణాల తెలుగమ్మాయిలా ఉంది.

చిరంజీవి ఫ్యామిలీ ఫంక్షన్లు, పండగ వంటి సందర్భాల్లో అందరూ కలుస్తారు.. సందడి చేస్తారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నాలుగు తరాలు అంటూ మెగా అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మెగా కోడలు ఉపాశన కూడా సోషల్ అవేర్ నెస్ తో పాటు, తన ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. వరస సినిమాలతో బిజిబిజిగా ఉన్నారు. మరోవైపు రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి..శంకర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక స్వయంగా నిర్మిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బర్త్ డే ను ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read:  ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ట్విస్ట్ రంగంలోకి అహ్మెద్ మసూద్ ఎంట్రీ .. మరోసారి అంతర్యుద్ధంలోకి వెళ్లబోతుందా

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..