Afghan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ట్విస్ట్ రంగంలోకి అహ్మెద్ మసూద్ ఎంట్రీ .. మరోసారి అంతర్యుద్ధంలోకి వెళ్లబోతుందా
Afghan Crisis: తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకొని పట్టుమని వారం కూడా కాలేదు.. అప్పుడే ఇంకో మలుపు తిరిగింది. పంజషీర్ ప్రావిన్స్ వేదికగా నేషనల్ రెసిస్టన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సంస్థ రంగంలోకి వచ్చింది..
Afghan Crisis: తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకొని పట్టుమని వారం కూడా కాలేదు.. అప్పుడే ఇంకో మలుపు తిరిగింది. పంజషీర్ ప్రావిన్స్ వేదికగా నేషనల్ రెసిస్టన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సంస్థ రంగంలోకి వచ్చింది. ఈ సంస్థని నార్దర్న్ అలియన్స్ ని అహ్మెద్ షా మసూద్ స్థాపించాడు 1979 లో. అప్పట్లో సోవియట్ సైన్యానికి ఎదురుగా నిలిచి పంజ్ షీర్ ప్రావిన్స్ లోకి సోవియట్ సైన్యం రాకుండా అడ్డుకున్నాడు అందుకే అహ్మెద్ షా మసూద్ కి పంజషీర్ సింహం అన్న బిరుదు ఇచ్చారు స్థానికులు. సోవియట్ సైన్యం వెనక్కి వెళ్లిపోయాక తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకోవాలి అని ప్రయత్నించినప్పుడు అహ్మెద్ షా మసూద్ తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు వాళ్ళని తన ప్రావిన్స్ అయిన పంజ్ షీర్ లోకి అడుగుపెట్టనివ్వలేదు. 1996 నుండి 2001 వరకు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని పాలించినా పంజ్ షీర్ లో మాత్రం వాళ్ళ పాలన లేదు. అటువంటి అహ్మెద్ షా మసూద్ అంటే తాలిబన్ల కి కూడా హడల్.. ఇప్పటి వరకు కూడా తాలిబన్లు పంజ్ షీర్ లో అడుగుపెట్టలేక పోయారు అంటే అక్కడి ప్రజల్లో అహ్మెద్ షా మసూద్ మీద ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 11,2001 లో అమెరికాలోని జంట టవర్లని కూల్చివేయడానికి రెండు రోజుల ముందు అంటే సెప్టెంబర్ 9,2001 న అల్ కైదా ఉగ్రవాదులు అహ్మెద్ షా మసూద్ ని హత్య చేశారు. ఈ హత్య చేసింది పాకిస్థాన్ ఐఎస్ఐ ని అనుమానం.. తండ్రి మరణం తర్వాత వారసుడిగా మసూద్ కొడుకు అహ్మెద్ మసూద్ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటి వరకు పంజ్ షీర్ ని తాలిబన్ల నుండి కాపాడుతూ వస్తున్నాడు.
అయితే తానే ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న అమృల్లాహ్ సలెహ్ ఇప్పుడు ఈ అమృల్లాహ్ సలేహ్ అహ్మెద్ మసూద్ తో చేతులు కలిపాడు. అమృల్లాహ్ సలేహ్ కూడా పంజ్ షీర్ ప్రావిన్స్ నుండి వచ్చినవాడే ఇక మరోవైపు తాను మళ్ళీ ఆఫ్గనిస్తాన్ వస్తానని.. తాలిబన్లని ఎదుర్కొంటానని మాజీ అధ్యక్షుడు ప్రకటించాడు. ఇతను కూడా అహ్మెద్ మసూద్ తో చేతులు కలుపుతున్నాడు. ఇక దేశ అధ్యక్షుడు దేశం వదిలి వెళ్ళిపోవడం తో ఇప్పుడు మిలటరీ & పోలీస్ కి చెందిన అధికారులు,సైనికులు, పోలీసులు అందరూ తమ తమ ఆయుధాలతో పంజ్ షీర్ చేరుకున్నారు. ఇప్పుడు వీళ్లందరూ కలిసి అహ్మెద్ మసూద్ నాయకత్వంలో తాలిబన్లకి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు.3 లక్షల మంది సైన్యం లో ఒక లక్షమంది పంజ్ షీర్ చేరుకునే దారిలో ఉన్నట్లు తెలుస్తున్నది.
ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన నార్దర్న్ అలియన్స్ Vs నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్థాన్. ఈ రెండూ పాకిస్థాన్ కి వ్యతిరేకంగా ఉండే ప్రావిన్స్ లు. వాషింగ్టన్ పోస్ట్ కధనం ప్రకారం అహ్మెద్ మసూద్ దగ్గర పెద్ద ఆయుధ డిపో ఉంది. చాలా కాలంగా ఆయుధాలు కొని వాటిని భద్రంగా తన డిపో లో దాస్తూ వస్తున్నాడు మసూద్. అహ్మెద్ మసూద్ : ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు అందుకే అధునాతన ఆయుధాలు స్టాక్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆఫ్ఘన్ సైన్యo,పోలీసులు కూడా తమ ఆయుధాలని తీసుకొని వస్తున్నారు. నా సారధ్యంలో మా నాన్న గారి వారసత్వాన్ని కొనసాగిస్తాను. తాలిబన్ల ని ఈ దేశ పాలకులుగా నేను ఒప్పుకోను అని అన్నాడు అంటూ వాషింగ్టన్ డీసీ వార్త కథనం.
అయితే తాలిబన్ల కి వ్యతిరేకంగా వీళ్లందరినీ కూడ గట్టి పోరాడడం అనేది అంత సులభం కాదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కి అహ్మెద్ షా మసూద్ కి అసలు పడదు. అలాంటిది షా మసూద్ కొడుకు అహ్మెద్ మసూద్ సారధ్యం లో తాలిబన్ల మీదకి తిరిగబడితే చూస్తూ కూర్చోడు. ఈ సారి అమెరికా,రష్యా,చైనా,పాకిస్థాన్ ల తో పాటు భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్ లో మైండ్ గేమ్ ఆడబోతున్నాయి. ఎవరిది పై చేయి అవుతుందో మరి కొన్ని వారాలలో తెలిసిపోతుంది కాకపోతే జన నష్టం మాత్రం తప్పదంటూ విదేశీ పత్రిక కథనం.