కాబూల్ నుంచి అమెరికన్ల తరలింపు చరిత్రలోనే చాలా కష్టతర ప్రక్రియ..చేతులెత్తేసిన అధ్యక్షుడు జోబైడెన్
కాబూల్ నుంచి ప్రజల (అమెరికన్ల) తరలింపు చరిత్ర లోనే చాలా కష్టతరమైన ప్రక్రియ అని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. ఈ ప్రక్రియ ఫలితం చివరకు ఎలా ఉఁటుందో తాను హామీ ఇవ్వలేనన్నారు. వైట్ హౌస్ నుంచి టీవీ ద్వారా ప్రసంగించిన ఆయన..
కాబూల్ నుంచి ప్రజల (అమెరికన్ల) తరలింపు చరిత్ర లోనే చాలా కష్టతరమైన ప్రక్రియ అని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. ఈ ప్రక్రియ ఫలితం చివరకు ఎలా ఉఁటుందో తాను హామీ ఇవ్వలేనన్నారు. వైట్ హౌస్ నుంచి టీవీ ద్వారా ప్రసంగించిన ఆయన.. ఎలాంటి గ్యారంటీని తను ఇవ్వలేనని, అయితే ప్రతి అమెరికన్ తరలింపునకు గల మార్గాలనన్నీ వినియోగించుకుంటామని చెప్పారు. చరిత్రలో ఇది అతి సుదీర్ఘమైన..క్లిష్టతరమైన పని.. ప్రమాదకరమైన తాలిబన్ దళాలు చుట్టుముట్టి ఉండగా సామూహిక తరలింపు మాటలతో అయ్యే పని కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. నష్టం జరగకుండా చూడగలుగుతామా అన్నది చెప్పలేనన్నారు. అయితే కమాండర్-ఇన్-చీఫ్ గా తరలింపునకు అవసరమైన ప్రతి వనరును వినియోగించుకుంటాం అని చెప్పారు. ఏ అమెరికన్ స్వదేశానికి తిరిగి రాగోరినా రావచ్చు అన్నారు. జులై నుంచి 18 వేలమంది, ఈ నెల 14 నాటికి 13 వేల మందిని అమెరికన్ విమానాలు తరలించాయన్నారు.ఆగస్టు 31 నాటికి ఆఫ్గాన్ నుంచి మొత్తం అమెరికన్లను ఇక్కడికి రప్పించుకోవచ్చునని ఆశిస్తున్నామన్నారు.కానీ అక్కడున్న మిలిటరీ కమాండర్ల ఉత్తర్వులను తాను సమర్థించబోనన్నారు. మా దేశస్థులను సురక్షితంగా తరలించడానికి జరిగే ప్రయత్నాలను సమన్వయ పరచాలని తాలిబన్లను కోరుతున్నానని, నిరంతరం వారితో టచ్ లో ఉంటున్నానని బైడెన్ చెప్పారు.
మా దళాలపై ఎలాంటి దాడి యత్నం జరిగినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని వారిని హెచ్చరించామన్నారు.అలాగే కాబూల్ మిత్ర పక్షాల తరలింపు లేదా వారి భద్రత గురించి కూడా తాలిబాన్లకు వివరించినట్టు ఆయన చెప్పారు. కాబూల్ లో జరుగుతున్న పరిణామాలు తనను కలవరానికి గురి చేశాయన్నారు.
మరోవైపు తమ దేశస్థులను కాబూల్ నుంచి షిఫ్ట్ చేసేందుకు అమెరికా నుంచి మూడు హెలికాఫ్టర్లు నగర విమానాశ్రయం వద్దకు చేరుకున్నాయి. ఎయిర్ పోర్టు అమెరికా దళాల ఆధీనంలోనే ఉన్నప్పటికీ.. విమానాశ్రయానికి దారి తీసే మార్గాల్లో తాలిబన్లు మోహరించి ఉండడంతో ఆ హెలీకాఫ్టర్లను చేరుకోవడానికి ప్రజలు సాహసించలేకపోతున్నారు. అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: రాహుల్ హత్యకేసులో సంచలన నిజాలు.. స్పీడ్ అందుకున్న ఇన్విస్టిగేషన్..:Rahul Murder Mystery Live Video.
Local to global Video: రాహుల్ హత్యకేసు మరియు నకిలీ చలానా కేసులో కదులుతున్న డొంక..(వీడియో).
బిల్డింగ్ పై నుంచి కుక్క జంప్.. క్యాచ్ పట్టి కుక్కను బలె కాపాడాడు.!వైరల్ వీడియో:Dog Viral Video.