Covovax vaccine: కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి సీరం కంపెనీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్

తాము ఉత్పత్తి చేస్తున్న కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ సీరం సంస్థ దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సీరం కంపెనీ కోవీషీల్డ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి...

Covovax vaccine: కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి సీరం కంపెనీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్
Covovax Vaccine
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 21, 2021 | 1:37 PM

తాము ఉత్పత్తి చేస్తున్న కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ సీరం సంస్థ దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సీరం కంపెనీ కోవీషీల్డ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతి పొందిన రెండో వ్యాక్సిన్.. కోవోవాక్స్ రెండవది అయినట్టు పూణేలోని ఈ సంస్థ తెలిపింది. తొలుత ఈ కంపెనీకి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులకు మధ్య సమావేశం ఈ నెల 10 న జరిగింది. 2-17 ఏళ్ళ మధ్య వయస్సు గలవారిసై కోవోవాక్స్ 2, 3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ఈ కంపెనీకి సెంట్రల్ డ్రగ్ అథారిటీకి చెందిన నిపుణుల బృందం గత జులైలో అనుమతినిచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. మొత్తం 920 మంది పిల్లలపై వీటిని నిర్వహించాలని, ఒక్కో గ్రూప్ లో 460 మంది ఉండాలని సూచించింది. 12-17, 2-11 ఏళ్ళ మధ్య వయస్సున్నవారై ఉండాలని నిర్దిష్టంగా సిఫారసు చేసింది. అటు-18 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ వయస్సు వారిపై కూడా రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించిన ప్రోటోకాల్ ని కూడా సీరం సంస్థ సమర్పించింది.

అమెరికాకు చెందిన నోవోవాక్స్ సంస్థతో భాగస్వామిగా సీరం.. కోవోవాక్స్ ని ఉత్పత్తి చేయనుంది. అక్టోబరులో ఈ వ్యాక్సిన్ ని లాంచ్ చేయనున్నట్టు ఈ కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా ఇదివరకే తెలిపారు. పెద్దలకు అక్టోబరులోనూ, పిల్లలకు వచ్చే ఏడాది మూడు నెలల్లోనూ ఇది అందుబాటులో ఉంటుందన్నారు. అటు దేశంలో కరోనా వైరస్ కేసులు 34 వేలకు పైగా నమోదయ్యాయాయి. గత 24 గంటల్లో 375 మంది రోగులు మరణించారు. రికవరీ రేటు 97.54 శాతం ఉంది. అయితే కేసులు, మరణాలు ఇంకా తగ్గాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత జోరందుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి. థర్డ్ వేవ్ ముప్పును విస్మరించరాదని పేర్కొంటున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: మంచు విష్ణు మరో షాక్..!’మా’ రచ్చ మళ్ళీనా..?హాట్ టాపిక్ గా మారిన విష్ణు ట్వీట్..:MAA Elections 2021 vIdeo.

శింగనమల మండలంలో విషాదం.. కొండపై నుండి కాలుజారి పూజారి మృతి..Priest Falls Down Live Video.

రాహుల్ హత్యకేసులో సంచలన నిజాలు.. స్పీడ్ అందుకున్న ఇన్విస్టిగేషన్..:Rahul Murder Mystery Live Video.

Local to global Video: రాహుల్ హత్యకేసు మరియు నకిలీ చలానా కేసులో కదులుతున్న డొంక..(వీడియో).