Afghanistan Crises: ప్రపంచంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న సహించేదీలేదు.. అఫ్ఘాన్‌పై స్పష్టత ఇచ్చిన అమెరికా అధ్యక్షులు బైడెన్
ఆప్ఘనిస్తాన్ ఎపిసోడ్‌పై ఆచితూచి స్పందిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. ప్రపంచంలో ఉగ్రవాదం ఏ మూలన ఉన్న సహించబోమని అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.
US President Joe Biden: ఆప్ఘనిస్తాన్ ఎపిసోడ్‌పై ఆచితూచి స్పందిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. ప్రపంచంలో ఉగ్రవాదం ఏ మూలన ఉన్న సహించబోమని అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఆప్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న అమెరికా పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తామని ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇంత వేగంగా పతనం సాధ్యమని ఎన్నడూ చెప్పలేదని జైడెన్, తాలిబన్లు కాబూల్‌ని అధిగమిస్తారన్న వార్తలను ఆయన ఖండించారు. అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న కొద్ది కాలంలోనే తాలిబన్లు ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పష్టత ఇచ్చిన బైడెన్.. ప్రస్తుతం అప్ఘాన్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న ఆరాచకాలను ఉపాధ్యక్షుడు కమలా హారిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాదాన్ని సహించబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇప్పటికే అమెరికన్ల తరలింపు ప్రారంభమైందన్నారు. 13 వేల మందిని తరలించినట్లు బైడెన్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘన్ నుంచి అమెరికన్లను తరలించడం అంత తేలిక కాదన్న ఆయన.. ఈ ప్రక్రియ అత్యంత ప్రమాదకరమని కామెంట్ చేశారు. అయినా అమెరికన్లను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తామని స్పష్టం చేశారు. అమెరికన్ల భద్రతే తమకు ప్రధానమని ప్రకటించారు. ఈ క్రమంలో ఇదే విషయంపై తాలిబన్లతో చర్చిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. అమెరికన్లను తరలించడానికి ఆఫ్ఘనిస్తాన్‌కు మరిన్ని విమానాలు పంపుతామన్నారు. తమ దేశ పౌరులపై హింసను సహించబోమని హెచ్చరించారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో వారం రోజులుగా కనిపిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయన్న అమెరికా అధ్యక్షుడు.. పరిస్థితిపై వచ్చేవారం జీ-7 దేశాల కూటమి చర్చిస్తుందని వివరించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించబోమంటూ.. తాలిబన్లకు వార్నింగ్ ఇచ్చారు. ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ వంటి వారినే ఏరివేశామన్న బైడెన్.. కాబూల్ విమానాశ్రయం ఆరువేల మంది అమెరికా సైనికుల పహారాలో ఉందని వివరించారు.