Megastar Chiranjeevi: అభిమానులకు మెగాస్టార్ పిలుపు.. తన బర్త్ డే రోజు ఇలా చేయండంటూ ఫ్యాన్స్‌కు చిరు విజ్ఞప్తి..

మెగాస్టార్ చిరంజీవికి అశేష అభిమాన గణం ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలకు ఆయన నటనకు, డాన్స్ లకు, డైలాగ్ లకు బారీ క్రేజ్ ఉంది.

Megastar Chiranjeevi: అభిమానులకు మెగాస్టార్ పిలుపు.. తన బర్త్ డే రోజు ఇలా చేయండంటూ ఫ్యాన్స్‌కు చిరు విజ్ఞప్తి..
Chiru
Follow us

|

Updated on: Aug 21, 2021 | 11:10 AM

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అశేష అభిమాన గణం ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలకు ఆయన నటనకు, డాన్స్‌‌‌లకు, డైలాగ్ లకు బారీ క్రేజ్ ఉంది. ఇక ఇటీవలే సినిమాలకు రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు చిరు. ఇపటికే ఆచార్య సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. అలాగే లూసిఫర్ రీమేక్ పనులు కుడా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే..మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగష్టు 22 సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చెప్పారు. అందుకు, యంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరితయజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో మీరంత పాల్గొనాలి, మూడు మొక్కలు నాటి, నాకు ట్విట్టర్‌లో ట్యాగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు చిరు. చిరు ట్వీట్ పై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ మెగాస్టార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి పరిరక్షణపై మెగాస్టార్‌కి ఉన్న ప్రేమను తెలియజేస్తున్నదని, ఆయన పుట్టిన రోజున అభిమానులంతా మొక్కలు నాటి చిరు కానుకను అందించాలని ఆకాంక్షించారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొనే ప్రతీ అభిమాని చిరుకు ట్యాగ్ చేయాలని సంతోష్ కుమార్ సూచించారు. తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలిచిన మెగాస్టార్ ఆయురారోగ్యాలతో కలకాలం అభిమానులను అలరించాలని ఆయన ఆకాంక్షించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

NTR 30 Movie: ఎన్టీఆర్-కొరటాల సినిమా ఆలస్యం అయ్యే అవకాశం.. కారణం ఇదే.. నిరాశలో ఫ్యాన్స్

Mega Family: మెగాస్టార్ చిరంజీవి ఇంట శ్రావణ శోభ.. మెగా ఫ్యామిలీ నాలుగు తరాల ఫోటో వైరల్

Sushanth : ‘బండి తియ్’ అంటున్న అక్కినేని హీరో.. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ నుంచి ప్రమోషనల్ సాంగ్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు