Manchu Manoj: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్, లక్ష్మీ.. ఆసక్తికర విషయాలు చెప్పిన హీరో..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక స్థా్న్నాన్ని ఏర్పర్చుకున్నాడు మంచు మనోజ్. కొద్ది కాలం వరుస సినిమాలతో
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక స్థా్న్నాన్ని ఏర్పర్చుకున్నాడు మంచు మనోజ్. కొద్ది కాలం వరుస సినిమాలతో స్టార్ హీరోగా దూసుకుపోయిన మంచు మనోజ్.. ఆ తర్వాత సినిమాలు అంతగా సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇక ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు విద్యానికేతన్ స్కూల్ వ్వహరాలు కూడా చూసుకుంటున్నాడు. ఇటీవల గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్.. ప్రస్తుతం అహం బ్రహ్మాస్మీ సినిమా చేస్తున్నాడు. అయితే ఇదిలా ఉంటే.. మంచు మనోజ్, లక్ష్మీ ప్రసన్నలు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పండుగ సందర్భంగా వారిద్దరూ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు.
మనోజ్ మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా తిరుపతికి వచ్చినట్లుగా చెప్పారు. అంతేకాకుండా.. లక్ష్మీ, తాను అనుకోకుండా వచ్చినట్లుగా చెప్పారు. ఇద్దరు వేరు వేరుగా ప్లాన్ చేసుకుని అనుకోకుండా వచ్చి ఇక్కడ కలిశామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను అహం బ్రహ్మాస్మీ సినిమా చేస్తున్నానని… త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నట్లుగా తెలిపాడు. అలాగే తాను కొత్తగా బిజినెస్ పెట్టబోతున్నట్లు కూడా వెల్లడించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలకు కల్పించేందుకు కొత్త వెంచర్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలిపాడు.
ఇదిలా ఉంటే.. అహం బ్రహ్మస్మీ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో.. సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాగే ఇందులో కీలక పాత్రలో అల్లరి నరేష్ నటించనున్నట్లగా టాక్ నడుస్తోంది.
Also Read: Nallennai chitra: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి మృతి.. ప్రముఖుల సంతాపం..
Enemy Movie: ఎనిమీ నుంచి పడదే సాంగ్.. శ్రోతలను మరోసారి ఆకట్టుకుంటున్న థమన్ మ్యూజిక్..
Prabhas: ప్రభాస్‌తో నేను పెళ్లికి సిద్ధం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ.