AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: మరో సర్‏ప్రైజ్ అదుర్స్.. చిరంజీవి గాడ్ ఫాదర్ మోషన్ పోస్టర్ రిలీజ్.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..

మెగాస్టార్ చిరంజీవి... చిత్రపరిశ్రమలో ఓ సంచలనం. ఇక రీఎంట్రీ తర్వాత చిరు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

Megastar Chiranjeevi: మరో సర్‏ప్రైజ్ అదుర్స్.. చిరంజీవి గాడ్ ఫాదర్ మోషన్ పోస్టర్ రిలీజ్.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Aug 21, 2021 | 6:21 PM

Share

మెగాస్టార్ చిరంజీవి… చిత్రపరిశ్రమలో ఓ సంచలనం. ఇక రీఎంట్రీ తర్వాత చిరు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మెగాస్టార్‏తో సినిమా చేసేందుకు దర్శకులు పోటీ పడుతున్నారు. రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వరుసగా విడుదలవుతున్నాయి. ప్రస్తుతం చిరు.. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్‏కు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో చిరుని వెనకాల నుంచి చూపిస్తూ.. సినిమా టైటిల్ గాడ్ ఫాదర్ కనిపిస్తుంది. ఇక ఈ మోషన్ పోస్టర్‏కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్‏తో మూవీపై ఇప్పుడే అభిమానులు ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇందుల కాజల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా.. రేపు ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ రానున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి బర్త్ డే ట్రీట్ వచ్చేసింది.. టైటిల్ పోస్టర్ రిలీజ్..

Manchu Manoj: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్, లక్ష్మీ.. ఆసక్తికర విషయాలు చెప్పిన హీరో..

Nallennai chitra: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి మృతి.. ప్రముఖుల సంతాపం..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం