Gold Merchants: దేశవ్యాప్తంగా  ‘సింబాలిక్ సమ్మె’ బంగారు ఆభరణాల వర్తకులు సిద్ధం.. ఎందుకంటే..

Gold Merchants: దేశవ్యాప్తంగా  'సింబాలిక్ సమ్మె' బంగారు ఆభరణాల వర్తకులు సిద్ధం.. ఎందుకంటే..
Gold Business

బంగారు ఆభరణాల తప్పనిసరి హాల్‌మార్కింగ్ "ఏకపక్ష అమలు" కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆభరణాల వ్యాపారులు ఆగస్టు 23 న ఒకరోజు 'సింబాలిక్ సమ్మె'ను పాటించనున్నారు.

KVD Varma

|

Aug 21, 2021 | 10:02 PM

Gold Merchants: బంగారు ఆభరణాల తప్పనిసరి హాల్‌మార్కింగ్ “ఏకపక్ష అమలు” కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆభరణాల వ్యాపారులు ఆగస్టు 23 న ఒకరోజు ‘సింబాలిక్ సమ్మె’ను పాటించనున్నారు. ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) ఆగస్టు 20 న ఈ సమాచారాన్ని ఇచ్చింది. కౌన్సిల్ ప్రకారం, ఈ సమ్మెకు రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు సంబంధించిన నాలుగు జోన్ల 350 సంఘాలు, సమాఖ్యల మద్దతు లభిస్తుంది.

రెండు నెలల క్రితమే బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి అయింది 

ప్రభుత్వం దీనిని మొదటి దశలో 2021 జూన్ 16 నుండి 28 రాష్ట్రాల్లోని 256 జిల్లాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేసింది. బంగారం యొక్క హాల్‌మార్కింగ్ దాని స్వచ్ఛతను తెలుపుతుంది. హాల్‌మార్క్ అమలులో ఉండాలని బులియన్ వ్యాపారులు ప్రభుత్వం నుండి డిమాండ్ చేశారు. అయితే హెచ్‌యూఐడీ  నియమాన్ని ఉపసంహరించుకోవాలి. స్టాక్ క్లియరెన్స్ లేనందున బులియన్ వ్యాపారులను వేధిస్తున్నారు. కనుక దీనిని వెంటనే నిలిపివేయాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. 

GUC మాజీ ఛైర్మన్ అశోక్ మినవాలా మాట్లాడుతూ, హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య)  ఏకపక్ష అమలుకు వ్యతిరేకంగా మా శాంతియుత నిరసన ఒకరోజు సింబాలిక్ సమ్మె అని అన్నారు. ఈ చట్టం అసాధ్యమైనది.. అసాధ్యం అయినది అని ఆయన చెబుతున్నారు. 

GJC యొక్క ముఖ్యాంశాలు …

  • స్వర్ణకారులు కొత్త హెచ్‌యూఐడీని అంగీకరించలేరు, ఎందుకంటే దానికి బంగారం స్వచ్ఛతతో ఎలాంటి సంబంధం లేదు,
  • ప్రస్తుతం, కొత్త హెచ్‌యూఐడీ సిస్టమ్ ఉత్పత్తుల హాల్‌మార్కింగ్‌కు 5 నుండి 10 రోజులు పడుతోంది.
  • వ్యాపారిగా తయారు చేయని/హాల్‌మార్క్ చేయని/విక్రయించని ఆభరణాల వ్యాపారులపై పెనాల్టీ భయం కారణంగా వ్యాపారం మూసివేత భయం ఎక్కువైంది. 
  • పరిశ్రమ నుండి నిరంతర డిమాండ్ ఉన్నప్పటికీ, బీఐఎస్ చట్టాన్ని తయారు చేస్తున్నప్పుడు నీతి ఆయోగ్ నివేదికలో ఇది పరిగణనలోకి తీసుకోబడలేదు.

ముందుగా హాల్‌మార్కింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం..

హాల్‌మార్క్ అనేది ప్రభుత్వ హామీ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) భారతదేశంలో హాల్‌మార్క్ చేసిన ఏకైక ఏజెన్సీ. హాల్‌మార్కింగ్‌లో, ఒక ఉత్పత్తి నిర్దిష్ట పారామితులపై ధృవీకరించబడుతుంది. బీఐఎస్ అనేది వినియోగదారులకు అందించబడుతున్న బంగారాన్ని పరిశీలించే సంస్థ. బంగారు నాణెం లేదా నగలపై హాల్‌మార్క్‌తో పాటు బీఐఎస్ లోగోను ఉంచడం అవసరం. బీఐఎస్ లైసెన్స్ పొందిన ల్యాబ్‌లో దాని స్వచ్ఛత పరీక్షించడం జరిగిందని ఇది రుజువు చేస్తుంది. 

ఇవి కూడా చదవండి: SBI: ఎస్‌బీఐ తన వినియోగదారులకు హెచ్చరిక.. వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!

Credit Card: రూ.99కే క్రెడిట్ కార్డు.. బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu