హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు.. లిస్టులో లేని టీమిండియా ఆటగాళ్లు

అంతర్జాతీయ క్రికెట్ లో సిక్సర్ల వీరులు, పరుగుల ధీరులు చాలా మందే ఉన్నారు. కానీ ఈసారి ఈ వీరులలో టీమిండియా ప్లేయర్స్ లేరు. వేరే దేశాలకు చెందిన ఆటగాళ్లు చెలరేగిపోయారు. మరి ఈ లిస్టులో ఏయే ప్లేయర్స్.. ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందామా..

హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు.. లిస్టులో లేని టీమిండియా ఆటగాళ్లు
Cricket 1
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 26, 2024 | 7:30 PM

2024లో వన్డే క్రికెట్‌లో చాలామంది ఆటగాళ్లు తమ సత్తా చాటుకున్నాడు. ఈ ఏడాది ఎందరో ఆటగాళ్లు వన్డేల్లో పరుగుల వరద పారించారు. పలు రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. ఇక 2024లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్లలో టీమిండియా బ్యాటర్లు లేకపోవడం గమనార్హం. అగ్రస్థానం నుంచి మూడో నెంబర్ వరకు శ్రీలంక బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. అలాగే ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లతో పాటు, 2024లో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఐదుగురు బ్యాట్స్‌మెన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..

2024లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినవారు వీరే..

శ్రీలంకకు చెందిన కుశాల్ మెండిస్ నెంబర్ వన్‌లో ఉన్నాడు. ఈ ఏడాది వన్డేల్లో 742 పరుగులు చేశాడు. 53.00 సగటుతో అతడు 1 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

రెండో స్థానంలో శ్రీలంకకు చెందిన పాతుమ్ నిస్సాంక పేరు ఉంది. ఈ ఏడాది వన్డేలో 12 మ్యాచ్‌లు ఆడిన పాతుమ్ నిస్సాంక 694 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని సగటు 63.09.

ఇవి కూడా చదవండి

శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక 2024లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. చరిత్ 18 మ్యాచ్‌ల్లో 605 పరుగులు చేశాడు. అతను 46.08 సగటుతో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు.

వెస్టిండీస్‌కు చెందిన కేసీ కార్తీ 12 మ్యాచ్‌ల్లో 560 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. అతని సగటు 62.22.

కెనడాకు చెందిన హర్ష్ థాకర్ ఐదో స్థానంలో ఉన్నాడు. 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 553 పరుగులు చేశాడు.

2024లో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఐదుగురు బ్యాట్స్‌మెన్లు వీరే..

వెస్టిండీస్‌కు చెందిన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 9 మ్యాచ్‌లలో 7 ఇన్నింగ్స్‌లలో 23 సిక్సర్లు కొట్టాడు.

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రహ్మానుల్లా గుర్బాజ్ 11 మ్యాచ్‌ల్లో 11 ఇన్నింగ్స్‌ల్లో 22 సిక్సర్లు బాదాడు.

ఇంగ్లాండ్‌ ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఈ ఏడాది వన్డేల్లో 8 ఇన్నింగ్స్‌ల్లో 21 సిక్సర్లు బాదాడు.

ఆఫ్ఘనిస్థాన్‌ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 12 ఇన్నింగ్స్‌ల్లో 20 సిక్సర్లు బాదాడు.

కెనడా ఆటగాడు ఆరోన్ జాన్సన్ 19 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

కనిపించని టీమిండియా ఆటగాళ్ల పేర్లు..

ఈ ఏడాది దక్షిణాఫ్రికాను ఓడించి భారత క్రికెట్ జట్టు టీ-20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. కానీ ఈ ఏడాది వన్డేల్లో టీమిండియా ఆటగాళ్లు ఆధిపత్యం పెద్దగా కనిపించట్లేదు. అత్యధిక పరుగులు చేసిన లేదా అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో టీమ్ ఇండియా ఆటగాళ్ల పేర్లు లేవు. ఇదిలా ఉంచితే ఈ ఏడాది భారత ఆటగాళ్లు ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడకపోవడం గమనార్హం.

ఇది చదవండి: బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..