బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్

టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్.. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. రంజీ ట్రోఫీలో చెలరేగిన అయ్యర్.. తన కెప్టెన్సీలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని సాధించాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలోనూ తనదైన శైలి బ్యాటింగ్‌తో అలరించాడు. తొలి మ్యాచ్‌లో పేలుడు సెంచరీ చేసిన శ్రేయాస్..

బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్
Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 24, 2024 | 3:17 PM

విజయ్ హజారే ట్రోఫీ రెండో రౌండ్‌లో ముంబై డిసెంబర్ 23న హైదరాబాద్‌తో తలపడింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. తిలక్‌ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ 169 పరుగులకే కుప్పకూలింది. ఇంత చిన్న లక్ష్యాన్ని ముంబై కేవలం 26 ఓవర్లలోనే సాధించింది. కానీ 7 వికెట్లు కోల్పోయింది. దీనికి కారణం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తీసుకున్న ఓ వినూత్న నిర్ణయం.

ఇది చదవండి: టిక్.. టాక్.. టిక్..! ఈ ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే

తనకంటే ముందే బౌలర్లు..

ముంబై యువ ఓపెనర్లు ఇద్దరూ 44 పరుగుల తర్వాత పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే దీని తర్వాత, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ లేదా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు రాలేదు, బదులుగా జట్టులోని బౌలింగ్ ఆల్-రౌండర్లు ప్రమోట్ అయ్యారు. సూర్యన్ష్ షెడ్గే, అథర్వ అంకోలేకర్, శార్దూల్ ఠాకూర్, తనుష్ కోటియన్ మొదటిగా బ్యాటింగ్‌కు వచ్చారు. దీని కారణంగా ముంబై కేవలం 67 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

9వ స్థానంలో వచ్చి..

అప్పుడు సూర్య కుమార్ యాదవ్‌ను ఎనిమిదో నెంబర్‌లో పంపారు. కానీ అతడు కూడా 18 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. అలాంటి సమయంలో శ్రేయాస్ స్వయంగా 9వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి జట్టును ఓటమి నుంచి కాపాడాడు. అయ్యర్ తన అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించి కేవలం 20 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టును 3 వికెట్ల తేడాతో విజయతీరాలకు చేర్చాడు. కోటియన్‌తో కలిసి అయ్యర్ 70 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. కోటియన్ కూడా అజేయంగా 39 పరుగులు చేశాడు.

ఇది చదవండి: ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌

శ్రేయాస్ 9వ స్థానంలో బ్యాటింగ్ ఎందుకు చేశాడన్నది ఇప్పుడు ప్రశ్న. జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్‌లకు అవకాశం ఇవ్వడం కోసమే శ్రేయాస్ అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. చిన్న లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని, ముంబై తన మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లకు బ్యాటింగ్ అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. తద్వారా వారు రాబోయే మ్యాచ్‌లకు కూడా సిద్ధం కావచ్చు. కానీ ఈ నిర్ణయం బెడిసికొట్టిందని చెప్పొచ్చు. ఆ స్థితిలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్వయంగా 9వ స్థానంలో వచ్చి 4 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి విజయాన్ని అందించాడు.

ఇది చదవండి: ఇదేం లొల్లిరా.. శోభనం రాత్రి వధువు వింత కోరికలు.. దెబ్బకు బిత్తరపోయిన వరుడు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ