Viral: ఇదేం లొల్లిరా.. శోభనం రాత్రి వధువు వింత కోరికలు.. దెబ్బకు బిత్తరపోయిన వరుడు
కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు ఆ వ్యక్తి ఉవ్విళ్ళూరుతున్నాడు. పెళ్లి చేసుకున్న మరుసటి రోజు నుంచి తన జీవితం మారిపోతుందని ఆశించాడు. తీరా శోభనం రోజున ఆ వ్యక్తి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఫస్ట్ నైట్ రోజున వధువు అడిగిన వింత కోరికలకు..
ఆ వ్యక్తి సంతోషంగా వివాహం చేసుకున్నాడు. మరుసటి రోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఉత్సాహంతో ఉన్నాడు. కానీ ఫస్ట్ నైట్ రోజున వధువు కోరికలు చూసి బిత్తరపోయాడు. ఇంతకీ ఆ వధువు ఏం కోరింది.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ నైట్ రోజున వధువు ఏకంగా గంజాయి, బీరు కావాలని అడగడంతో వరుడు దెబ్బకు బిత్తరపోయాడు. దెబ్బకు తన పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకున్నాడు. అలాగే వధువు అడిగిన కోరికలు.. వరుడు తన కుటుంబసభ్యులకు చెప్పడంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులకు సమాచారం అందించడంతో.. జంటకు కౌన్సిలింగ్ ఇవ్వగా.. వరుడు మాత్రం ఈ పెళ్లి ససేమిరా వద్దని తేల్చి చెప్పేశాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు ఒకటికి రెండుసార్లు ఆ వరుడిని తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరగా.. ఇలాంటి పద్దతులను అతడు ఒప్పుకునే ఆలోచనలో లేడని తేలిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇది చదవండి:అబ్బబ్బో అరాచకం.. బోల్డ్ సిరీస్‌తో కవ్వించిన ఈ టాలీవుడ్ భామ ఎవరో తెల్సా