మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం చేయకండి

ప్రతి చిన్న అప్లికేషన్‌కి జిరాక్స్ కాపీలు కచ్చితంగా అవసరం అవుతాయి. బ్యాంకు లోన్ తీసుకోవాలన్నా, జాబ్ అప్లికేషన్ పెట్టాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, చివరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా బోలెడన్ని డాక్యుమెంట్లు జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇలా..

మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం చేయకండి
Representative Image
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Ravi Kiran

Updated on: Dec 26, 2024 | 7:15 PM

కామన్‌గా జిరాక్స్ సెంటర్‌కి వెళ్లేవారు చేసే పని అక్కడున్న ఈ-మెయిల్‌కి, లేదా వాట్సప్‌కి తమ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని పంపి ప్రింట్ ఇవ్వమని చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో అన్నింటిని మొబైల్‌లో ఫోటో కాపీ తీసుకుని పెట్టుకోవడం అందరికీ అలవాటుగా మారింది. మొబైల్ నుంచి ఒరిజినల్ జిరాక్స్ సెంటర్ మెయిల్ ఐడీకి లేదా వాట్సప్‌కి పంపించి ప్రింట్ అడుగుతుంటాం. కానీ అక్కడే ఓ పెద్ద స్కాంకి మొదటి అడుగు పడుతుంది. మనం చాలా ఈజీగా ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్ పోర్టులు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు వారికి మెయిల్ చేసి ప్రింట్ తీయించుకుంటాం.

కొన్నిసార్లు అయితే మన ఫోటోలు కూడా కలర్ ప్రింట్ తీయించుకుంటాం. కానీ మన ఒరిజినల్ కాపీలు డిలీట్ చేశారా అని ఒక్కసారి కూడా ఒక్కరు కూడా చెక్ చేసుకోరు. రోజూ కొన్ని వందల మంది ఆధార్ కార్డులు, పాన్ కార్డులు జిరాక్స్ సెంటర్‌లో ఉండిపోతాయి. వీటన్నింటినీ డేటా కలెక్షన్ ఏజెంట్స్ కొంత డబ్బులు ముట్టజెప్పి సేకరిస్తారు. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్‌లు ఓపెన్ చేస్తారు. రకరకాల కాల్ సెంటర్‌లలో వినియోగించే సిమ్ కార్డులు కూడా ఇలాంటి డేటా ఉపయోగించి తీసుకునేవి. కాల్ మనీ, మనీ యాప్స్, లోన్ యాప్స్ లాంటి ఇల్లీగల్ మనీ సర్కులేషన్ అంతా ఇలాంటి బ్యాంక్ అకౌంట్స్ నుంచి చేస్తూ ఉంటారు. మొబైల్ నెంబర్ మనది ఉండదు కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయినట్లుగా.. క్లోజ్ అయినట్లుగా.. కూడా మనకు తెలియదు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంక్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఆన్లైన్‌లో ఐదు నిమిషాల్లో అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. మనం జిరాక్స్ సెంటర్‌కి పంపిన మెయిల్‌లో ఉన్న డాక్యుమెంట్స్‌తో బ్యాంక్ అకౌంట్, సిమ్ కార్డ్ ఈజీగా పొందవచ్చు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న స్కాం.

దీనికి పరిష్కారం ఏంటి?

సింపుల్… అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం క్యారీ చేయలేం. ఇందుకు పరిష్కారం ఒక పెన్ డ్రైవ్‌లో మనకు కావలసిన డాక్యుమెంట్స్ అన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. అవసరమైతే ఒకటి మన కారులోనూ, బైక్‌లోనూ పెట్టుకున్నా అలా ఉండిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా పర్స్‌లో పట్టే చిన్న పెన్ డ్రైవ్‌లు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్న డాక్యుమెంట్లను కాపీ చేసుకోకుండా లాక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో పెన్ డ్రైవ్‌ని జిరాక్స్ సెంటర్‌లో ఇచ్చి జిరాక్స్ తీయమని అడిగినప్పుడు ఎక్స్‌ట్రా కాపీలు తీసుకోకుండా మనం జాగ్రత్తగా గమనించాలి. పెన్ డ్రైవ్‌లో ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని ఎలాగో కాపీ చేసే అవకాశం ఉండదు. ఇకపై ఎక్కడపడితే అక్కడ మీ విలువైన సమాచారాన్ని, డాక్యుమెంట్లని ఈ-మెయిల్, వాట్సాప్‌లో పంపకండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్‌ కింద కనిపించింది చూడగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే