Credit Card: రూ.99కే క్రెడిట్ కార్డు.. బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..!

Credit Card: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు పొందాలంటే సులభమైన పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకు నుంచే కాకుండా ప్రైవేటు ఫైనాన్సియల్‌ సంస్థల నుంచి కూడా సులభంగా..

Credit Card: రూ.99కే క్రెడిట్ కార్డు.. బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 21, 2021 | 11:01 AM

Credit Card: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు పొందాలంటే సులభమైన పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకు నుంచే కాకుండా ప్రైవేటు ఫైనాన్సియల్‌ సంస్థల నుంచి కూడా సులభంగా క్రెడిట్‌ కార్డును పొందవచ్చు. గతంలో ఉన్న ప్రాసెసింగ్‌ కాకుండా ఈజీ ప్రాసెస్‌ పద్దతుల్లో పొందవచ్చు. ఇక డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ క్రెడిట్‌బీ కస్టమర్లకు శుభవార్త అందించింది. కొత్త కార్డును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది క్రెడిట్ కార్డు లాంటిదనే చెప్పుకోవాలి. ఇది వర్చువల్ కార్డు. అంటే ఫిజికల్ కార్డు కాదు. చేతితో పట్టుకోలేం. దీని ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించవచ్చు. క్రెడిట్‌బీ యాప్ ద్వారా మీరు ఈ వర్చువల్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారు కార్డు పొందవచ్చు. కార్డు లిమిట్ రూ.10 వేలు. దీని కోసం మీరు రూ.99 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఏడాది రూ.149 మెయింటెన్స్ చార్జీలు చెల్లించుకోవాల్సి ఉటుంది.

ఈ కార్డు ద్వారా మీరు బ్యాంక్ ఖాతాకు కూడా నేరుగా లిమిట్ డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. 5-7 శాతం వడ్డీ పడుతుంది. కార్డు ద్వారా ఉపయోగించిన డబ్బులను 45 రోజులలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే రూ.100 చార్జీ పడుతుంది. ఇంకా రోజుకు 0.15 శాతం లేట్ పేమెంట్ ఫీజు చెల్లించాలి.

సక్రమంగా చెల్లిస్తే కార్డు లిమిట్‌ పెంపు..

కాగా, మీరు కార్డును సక్రమంగా ఉపయోగిస్తూ, ప్రతి నెలా బిల్లు డబ్బులను చెల్లిస్తూ వెలితే.. కార్డు లిమిట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు కార్డును ఉపయోగించే విధానం ప్రాతిపదికన మీ క్రెడిట్ లిమిట్ పెంపు ఆధారపడి ఉంటుందని గమనించాలి. బ్యాంకు క్రెడిట్‌ కార్డులాగే ఉపయోగించుకోవచ్చు. కానీ సమయానికి తీసుకున్న డబ్బులు కట్టకపోతే అధిక ఛార్జీలతో నడ్డి విరుస్తారు. కాగా, బ్యాంకులు సైతం క్రెడిట్‌ కార్డులను భారీగానే జారీ చేస్తోంది. ఈ కార్డుల ద్వారా డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా కల్పిస్తున్నాయి. కానీ సమయానికి డబ్బులు చెల్లించకపోతే మోత మోగిపోతుంది. క్రెడిట్‌ కార్డులు జారీ చేయాలంటే గతంలో నిబంధనలు కఠినతరం ఉండేది. ఇప్పుడు ఇలాంటి నిబంధనలేమి లేవు. కేవలం ఫోన్‌ల ద్వారానే కార్డులను జారీ చేస్తున్నాయి. ఈ క్రెడిట్‌ కార్డులపై షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, ఆన్‌లైన్‌ షాపింగ్స్‌ తదితర వాటిలో అనేక రకాల డిస్కౌంట్లు, ఆఫర్లు కల్పిస్తుంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే రివార్డు పాయింట్లు కూడా వస్తాయి.

ఇవీ కూడా చదవండి:

Post Office: సీనియర్‌ సిటిజన్స్‌ కోసం పోస్టల్‌ శాఖ గుడ్‌న్యూస్‌.. నిబంధనలు మార్పుల చేస్తూ కీలక నిర్ణయం..!

LPG Gas Cylinder Price: పేదల నడ్డి విరుస్తున్న గ్యాస్‌ సిలిండర్ ధరలు.. ఒక సంవత్సరంలో ఎంత పెరిగిందంటే..

2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!