LPG Gas Cylinder Price: పేదల నడ్డి విరుస్తున్న గ్యాస్‌ సిలిండర్ ధరలు.. ఒక సంవత్సరంలో ఎంత పెరిగిందంటే..

LPG Gas Cylinder Price: వంట గ్యాస్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్యాస్‌ కంపెనీలు ప్రతి నెల ఎంతో కొంత పెంచడంతో సామాన్యుడికి నడ్డి విరిచినట్లవుతుంది. ఒక వైపు నిత్యవసర..

LPG Gas Cylinder Price: పేదల నడ్డి విరుస్తున్న గ్యాస్‌ సిలిండర్ ధరలు.. ఒక సంవత్సరంలో ఎంత పెరిగిందంటే..
Follow us

|

Updated on: Aug 20, 2021 | 2:05 PM

LPG Gas Cylinder Price: వంట గ్యాస్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్యాస్‌ కంపెనీలు ప్రతి నెల ఎంతో కొంత పెంచడంతో సామాన్యుడికి నడ్డి విరిచినట్లవుతుంది. ఒక వైపు నిత్యవసర సరుకులతో ఇబ్బందులకు గురవుతున్న సామాన్య ప్రజలు.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో మరింత భారం పడుతోంది. ఇక సిలిండర్‌ ధరలు కూడా పెరుగుతుండటంతో మరింత భారం మోపుతున్నట్లవుతుంది. ఈ కారణంగా పేదలు స్టౌమ్‌పై వంట చేసుకునేందుకు ఇబ్బందిగా మారిపోతుంది. గత ఏడాదిలో దేశీయ గ్యాస్‌ సిలిండర్‌ ధఱ రూ.265కు పెరిగింది. ఆగస్టు 17న సిలిండర్‌ ధరపై రూ.25 పెరిగింది. దీంతో 14.2 కిలోల సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 859.50, ముంబైలో రూ .859.50, కోల్‌కతాలో రూ .886, చెన్నైలో రూ .875.50. సరిగ్గా ఒక సంవత్సరం కిందట ఆగస్టు 1, 2020 న ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ .594 ఉండగా, కోల్‌కతాలో రూ .621, ముంబైలో రూ .594 మరియు చెన్నైలో రూ .610.50 ఉంది.

ఈ ఏడాది గత ఎనిమిది నెలల్లో గ్యాస్ సిలిండర్ల ధర రూ .165 పెరిగింది. 31 డిసెంబర్ 2020 నాటికి గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 694 ఉండగా, కోల్‌కతాలో రూ. 720.50, ముంబైలో రూ. 694 మరియు చెన్నైలో రూ .710. కరోనా సమయంలో ప్రభుత్వం సబ్సిడీని గణనీయంగా తగ్గించింది. ధర చాలా పెరగడానికి కారణం ఇదే. ప్రస్తుతం, కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే సబ్సిడీ ప్రయోజనం అందుబాటులో ఉంది.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌లపై ప్రభుత్వం సబ్సిడీని క్రమంగా తగ్గించింది. సీఎన్‌బీసీ TV18 నివేదిక ప్రకారం.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం LPG గ్యాస్ సిలిండర్‌లపై 29 వేల 627 కోట్ల రూపాయలను సబ్సిడీగా ఇచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 25,520 కోట్లకు తగ్గింది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ .12,480 కోట్లు సబ్సిడీగా ప్రకటించబడింది.

గ్యాస్ సిలిండర్ల ధర పెరుగుతున్న తీరును చూస్తే, ఉజ్వల పథకం ప్రయోజనం అసంపూర్తిగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఈ పథకం మొదటి దశలో, 8.03 కోట్ల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ప్రభుత్వం 1 కోటి ఉచిత కనెక్షన్లను పంపిణీ చేస్తుంది. ఉజ్వల స్కీమ్ 2.0 ని ఆగస్టు 10 న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రతి నెల 1వ తేదీన చమురు సంస్థలు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను సవరిస్తూ ఉంటాయి. ఆగస్టు 1న వాణిజ్య సిలిండర్‌ ధరపై మాత్రమే పెరుగగా, 14.2 కిలోల సిలిండర్‌ ధరలో మార్పులు చేయలేదు. కానీ ఆగస్టు 17న మాత్రం మళ్లీ ధరలను పెంచాయి చమురు సంస్థలు.

ఇవీ కూడా చదవండి: SBI: ఎస్‌బీఐ తన వినియోగదారులకు హెచ్చరిక.. వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!

Gold Fixed Deposit Scheme: మీ ఇంట్లో బంగారం ఉందా..? ఈ స్కీమ్‌లో పెడితే వడ్డీ పొందవచ్చు..!

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!