Revanth Reddy: చంద్రబాబు, కేసీఆర్, వైఎస్సార్ అక్కడి నుంచే ఎదిగారు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

యూత్ కాంగ్రెస్ నాయకులు ఎంతో మంది పెద్ద నాయకులు అయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. చాలా మంది నాయకులను కాంగ్రెస్

Revanth Reddy: చంద్రబాబు, కేసీఆర్, వైఎస్సార్ అక్కడి నుంచే ఎదిగారు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Re
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 21, 2021 | 6:37 PM

TPCC Chief – Revanth Reddy – Youth Congress: యూత్ కాంగ్రెస్ నాయకులు ఎంతో మంది పెద్ద నాయకులు అయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. చాలా మంది నాయకులను కాంగ్రెస్ తయారు చేసిందని చెప్పిన రేవంత్ రెడ్డి.. చంద్రబాబు, కేసీఆర్, వైయస్ఆర్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళేనని ఆయన గుర్తు చేశారు. “యూత్ కాంగ్రెస్ వాళ్ళు టిక్కెట్లు అడిగే ముందు.. ప్రజల కోసం ప్రభుత్వం మీద ఏం కొట్లాడినరో చూస్తాం. టిక్కెట్ తీసుకుని జనం లోకి పోతా అంటే… ఓడిపోతారు. పోటీ చేసి ఓడిపోతే బాల్య వితంతులుగా మారిపోతారు.” అని రేవంత్ యూత్ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు.

“రేవంత్ పార్టీ మారలేదా అంటున్నారు.. రేవంత్ పార్టీ మారింది… ప్రతిపక్షంలో చేరి కొట్లాడినా. కానీ.. అధికార పార్టీ లోకి అధికారం కోసం పోలేదు. చేతికి మట్టి అంటకుండా యూత్ కాంగ్రెస్ నాయకుడ్ని అంటే ఎవరూ పట్టించుకోరు. శివసేన రెడ్డి కాలు చిప్ప పగల గొట్టుకుంటే… రాహుల్ గాంధీ పక్కన కూర్చున్నాడు. పని చేసే వారికి గుర్తింపు ఉంటది. మీరు కష్టపడితే .. ఇంటికి బి ఫామ్ తీసుకువచ్చి ఇస్తా. 20 నెలల్లో కష్టపడితే టిక్కెట్లు ఇస్తాం.. లేదంటే టిక్కెట్ల ఇచ్చేది లేదు.” అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇవాళ హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి అధ్యక్షతన జరిగిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై విధంగా యూత్ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, మల్లు రవి తదితరులు కూడా పాల్గొన్నారు.

Rev

Read also: JNTU: విలాసాలకు అడ్డాగా సరస్వతీ నిలయం.. హనీమూన్‌ హబ్‌గా మారిపోయిన యూనివర్శిటీ గెస్ట్‌హౌస్‌

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?