- Telugu News Photo Gallery Technology photos Realme Launches New Smartphone C21 In India On August 23rd Have a Look On Features And Price
Realme C21Y: భారత మార్కెట్లోకి రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్.. ధర రూ. 10వేల లోపే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.
Realme C21Y: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రియల్‌మీ సీ 21వై పేరుతో లాంచ్ చేయనున్న ఈ ఫోన్ భారత మార్కెట్లో రూ. 10 లోపే అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..
Updated on: Aug 21, 2021 | 6:32 PM

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తోన్న చైనాకు చెందిన దిగ్గజ సంస్థ రియల్‌మీ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది.

యల్‌మీ సీ21వై పేరుతో ఇప్పటికే వియత్నంలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తేనుంది. మన దేశంలో ఈ ఫోన్ ధర రూ. 10వేల లోపే ఉండనున్నట్లు సమాచారం.

ఆగస్టు 23న విడుదల కానున్న ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.. ఈ స్మార్ట్ ఫోన్‌ను 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో తీసుకురానున్నారు.

ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

కెమెరా విషయానికొస్తే వెనకాల మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెర 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

కెమెరా విషయానికొస్తే వెనకాల మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెర 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.




