- Telugu News Photo Gallery Technology photos Are You Using WhatsApp GB Version Your Personal Information May Be In Danger
GB WhatsApp: అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయని అలాంటి వాట్సాప్‌లను వాడుతున్నారా.? మొదటికే మోసం వస్తుంది జాగ్రత్తా.!
GB WhatsApp: వాట్సాప్‌ను పోలిన జీబీ వాట్సాప్, వాట్సాప్ ప్లస్ వంటి యాప్‌లు తెగ హల్చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే మంచి ఫీచర్లు ఉండే ఈ యాప్‌లను ఉపయోగించడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని మీకు తెలుసా.? ఈ యాప్‌ల మాటున పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే..
Updated on: Aug 21, 2021 | 8:02 PM

ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుంది. ఇందులో ఉండే ఫీచర్లే దీనికి కారణం.

ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుంది. ఇందులో ఉండే ఫీచర్లే దీనికి కారణం.

అసలు వాట్సాప్‌లో లేని కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఈ నకిలీ వాట్సాప్‌లలో ఉండడంతో చాలా మంది వీటిని డౌన్‌లోడ్ చేసుకుని ఎంచక్కా వాడుతున్నారు.

అయితే ఈ యాప్‌లు ఎంత మాత్రం మంచివి కావని మీకు తెలుసా.? ఇలాంటి యాప్‌లను వాట్సాప్ 2019లోనే నిషేధించింది. ఇలాంటి యాప్‌లను ఉపయోగించిన వారి ఖాతాలను బ్యాన్ చేస్తుందని వినియోగదారులకు వాట్సాప్ హెచ్చరించింది.

ఈ యాప్‌లో ఎలాంటి సెక్యూరిటీ చెక్ లేదని వాట్సాప్ తెలిపింది. అసలు యాప్‌లో మీ డేటా సురక్షితంగా ఉండదని స్పష్టం చేసింది. అదే సమయంలో గోప్యతకు సంబంధించి మీకు ఎలాంటి రక్షణ లభించదు.

ఇక ప్లేస్టోర్‌లో లభించని ఈ యాప్‌ను ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేసుకునే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాంటి సమయంలో ఏపీకే ఫైల్‌తో పాటు ప్రమాదకరమైన వైరస్ మీ ఫోన్‌లోకి ప్రవేశించవచ్చు.. ఆపై మీ ఫోన్ కూడా హ్యాక్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి యాప్‌ల జోలికి పోకవోవడమే మంచిది.




