Indian Navy Jobs 2021: నేవల్ షిప్ రిపేర్ యార్డులో ఉద్యోగాలు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Naval Ship Repair Yard Recruitment: నేవల్ షిప్ రిపేర్ యార్డులో ఖాళీగా ఉన్న పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. పోర్ట్ బ్లేయర్‌లో ఉన్న ఈ సంస్థలో మొత్తం..
Indian Navy Jobs 2021: నేవల్ షిప్ రిపేర్ యార్డులో ఖాళీగా ఉన్న పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. పోర్ట్ బ్లేయర్‌లో ఉన్న ఈ సంస్థలో మొత్తం 302 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్‌ను ఇండియన్ నేవీ విడుదల చేసింది. ఖాళీల వివరాలతో పాటు, అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలపై మీరూ ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా డిసిగ్నేటెడ్ ట్రేడ్, నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్‌మెన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. * మొత్తం 302 ఖాళీలకుగాను మెషినిస్ట్ 16, ప్లంబర్/పైప్ ఫిట్టర్ 8, పెయింటర్ 7, టైలర్ 6, వెల్డర్ 20, మెకానిక్ ఎంటీఎం 7, వెల్డర్ షిప్ ఫిట్టర్ 3, షీట్ మెటల్ వర్కర్ 1 (డిజైన్‌డ్ పోస్టులు), ఎలక్ట్రానిక్ మెకానిక్ 46, ఎలక్ట్రిషన్ 29, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 8, ఫిట్టర్ 37, డీజిల్ మెకానిక్ 42, ఆర్‌ఈఎఫ్ అండ్ ఏసీ మెకానిక్ 11, షీట్ మెటల్ వర్కర్ 18, కార్పెంటర్ 33, మాసన్ 7, ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 (నాన్ డిజైన్‌డ్ పోస్టులు) పోస్టులున్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. * అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల చేసిన 50 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులు తమ దరఖాస్తులను పోర్ట్ బ్లెయర్‌లోని నేవల్ షిప్ రిపేర్ యార్డ్ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Income Tax: మీరు ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా..? ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి.. లేకపోతే నష్టమే..!
Sonu Sood: ముంబయి మేయర్ అభ్యర్థిగా రియల్ హీరో.. సోనూ సూద్ రియాక్షన్ అదుర్స్..