AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: ముంబయి మేయర్ అభ్యర్థిగా రియల్ హీరో.. సోనూ సూద్ రియాక్షన్ అదుర్స్..

లాక్‏డౌన్ సమయంలో వలస కార్మికులకు రవాణా సౌకర్యాలు కల్పించడమే కాకుండా.. వారికి ఆర్థికంగా సాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా

Sonu Sood: ముంబయి మేయర్ అభ్యర్థిగా రియల్ హీరో.. సోనూ సూద్ రియాక్షన్ అదుర్స్..
Sonu Sood
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 24, 2021 | 7:53 PM

Share

లాక్‏డౌన్ సమయంలో వలస కార్మికులకు రవాణా సౌకర్యాలు కల్పించడమే కాకుండా.. వారికి ఆర్థికంగా సాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసిన ఎంతోమందికి అపద్భాందవుడయ్యాడు. కరోనా కేసులు తగ్గి.. లాక్‏డౌన్ ఎత్తివేసినా.. సోనూసూద్ సాయం చేయడం మాత్రం ఆపలేదు. భాషతో సంబంధం లేకుండా.. దేశ వ్యాప్తంగా ఎంతో మందికి తన వంతు సహాయాన్ని చేస్తున్నాడు. కరోనా రోగులకు చికిత్స ఖర్చుల నుంచి ఆక్సిజన్ సిలిండర్స్, వెంటిలెటర్స్ ఇలా ఎన్నో సహాయాలను అందిస్తున్నాడు. సోనూసూద్ ద్వారా సాయం పొందిన వారు మాత్రమే కాకుండా.. సామాన్య ప్రజలు సైతం ఆయనను దైవంగా భావిస్తూ.. పూజిస్తున్నారు. తమ వ్యాపార సంస్థలకు, పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

అయితే ఇప్పటివరకు ఎన్నో సేవ కార్యక్రమాలను కొనసాగిస్తోన్న సోనూసూద్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2022లో నిర్వహించనున్న బృహన్ ముంబాయి మున్నిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున సోనూసూద్ పోటీ చేసే అవకాశం ఉందని కథనాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు సెలబ్రిటీలను ఎంపిక చేసుకుందని, ఆ జాబితాలో సోనూతోపాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్‏ముఖ్ తనయుడు, నటుడు రితేష్ దేశ్‏ముఖ్, మోడల్, ఫిట్‏నెస్ పర్సనాలిటీ మిలింద్ సోమన్ నిలిచారని టాక్ వినిపించింది. త్వరలోనే ఈ ముగ్గురిలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం సాగింది. తాజాగా సోనూసూద్ ఈ విషయంపై స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని తెలిపారు. ఆ వార్తల్లో నిజం లేదు. సాధారణ వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను అంటూ స్పష్టం చేశారు. దీంతో సోనూసూద్ రాజకీయా్లోకి రావాలని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు వద్దని చెబుతున్నారు.

ట్వీట్…

Also Read: Mahesh Babu: కరోనా టైమ్‌లో మహేష్ బాబు సాహసం… మల్టీప్లెక్స్ బిజినెస్ మరింత ముందుకు తీసుకెళ్లనున్న సూపర్ స్టార్..

హీరోయిన్ కోసం వచ్చి చిక్కుల్లో పడ్డ హీరో.. ఆకట్టుకుంటోన్న ఇచ్చట వాహనాలు నిలుపరాదు మూవీ ట్రైలర్..

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!