AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: కరోనా టైమ్‌లో మహేష్ బాబు సాహసం… మల్టీప్లెక్స్ బిజినెస్ మరింత ముందుకు తీసుకెళ్లనున్న సూపర్ స్టార్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ..

Mahesh Babu: కరోనా టైమ్‌లో మహేష్ బాబు సాహసం... మల్టీప్లెక్స్ బిజినెస్ మరింత ముందుకు తీసుకెళ్లనున్న సూపర్ స్టార్..
Mahesh Babu
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 24, 2021 | 8:26 AM

Share

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ.. టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక సినిమాలతోనే కాకుండా బిజినెస్ మ్యాన్‌గానూ మహేష్ రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వ్యాపార ఉత్పత్తులకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా అన్నవిషయం తెలిసిందే. అలాగే మల్టీప్లెక్స్ రంగంలోనూ మహేష్ అడుగు పెట్టాడు. హైదరాబాద్‌లో ఏ ఎంబీ పేరుతో మల్టీప్లెక్స్ ఏర్పాటరు చేసిన విషయం తెలిసిందే. సిటీకి దూరంగా ఉన్నప్పటికీ నగరంలోని మూవీ లవర్స్ ‘ఏయంబీ సినిమాస్‌’ సినిమా వీక్షించేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. భారీ స్క్రీన్‌తో పాటు.. 4D సౌండ్ సిస్టమ్‌తో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక ఇప్పుడు తన మల్టీప్లెక్స్ బిజినెస్ మరింత ముందుకు తీసుకెళ్లనున్నాడు మహేష్.

మహేష్ తన వ్యాపారాన్ని విస్తరించబోతున్నట్లు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తున్న వార్త.  హైదరాబాద్‌లోని  నానక్‌రామ్ గూడాలో ఓ భారీ బహుళ అంతస్థుల హైబ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మించనున్నాడు మహేష్. ఏ ఎంబీ సినిమాస్ రెండవ మల్టీప్లెక్స్ ఇది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించనున్నారు. ఇక ఇది మొదటి దానికంటే మరింత పెద్దదిగా..ఎక్కువ సంఖ్యలో సీటింగ్ క్యాపాసిటి కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఇక కరోనా కల్లోలం సమయంలో మహేష్ ఇలా తన బిజినెస్‌ను విస్తరించడం సాహసమే అంటున్నారు కొందరు విశ్లేషకులు. కరోనా మహమ్మారి కారణంగా చాలా పరిశ్రమలపైన  దారుణమైన ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మహేష్ ఇలా మల్టీప్లెక్స్ బిజినెస్‌ను విస్తరించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పరశురమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో మహేష్ మరింత స్టైలిష్‌గా కనిపించనున్నాడు. సంక్రాంతికానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut Thalaivi: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తలైవి మూవీ విడుదలకు డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Allu Arjun Pooja Hegde: అల్లు అర్జున్, పూజాహెగ్డే కాంబినేషన్ మళ్లీ రిపీట్‌కానుందా..!

Actress Priyanka Pandit: మరో భోజ్‌పురి నటి ప్రైవేటు వీడియో లీక్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌..!