AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: డీజీపీని కలిసిన రమ్య ఫ్యామిలీ.. తమను వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని విన్నపం

AP Crime News: ఏపీలో సంచలనం సృష్టించిన రమ్య హత్య కేసు విషయంపై రమ్య కుటుంబ సభ్యులు ఏపీడీజీపీని కలిశారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రమ్య కుటుంబ సభ్యులు హత్యకు ముందు,..

AP Crime News: డీజీపీని కలిసిన రమ్య ఫ్యామిలీ.. తమను వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని విన్నపం
Ramya Family
Surya Kala
|

Updated on: Aug 23, 2021 | 9:38 PM

Share

AP Crime News: ఏపీలో సంచలనం సృష్టించిన రమ్య హత్య కేసు విషయంపై రమ్య కుటుంబ సభ్యులు ఏపీడీజీపీని కలిశారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రమ్య కుటుంబ సభ్యులు హత్యకు ముందు, తరువాత జరిగిన పరిణామాలను వివరించారు. ఘటన అనంతరం పోలీసులు సత్వరం స్పందించి ముద్దాయిని అరెస్ట్ చేసినందుకు కృతఙ్ఞతలు చెప్పారు. ఒక దుర్ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో ఎన్నడూ చూడలేదని రమ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు.

అంతేకాదు తమ కుటుంబం పైన కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా వేదిస్తున్నారని రమ్య కుటుంబ సభ్యులు వాపోయారు. డబ్బులకు అమ్ముడుపోయా మంటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో తమకు భోజనం కూడా చేయాలనిపించడంలేదని రమ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

రమ్య ఫ్యామిలీ కి డీజీపీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన గుంటూరు అర్బన్ ఎస్పీ, సిబ్బందిని అభినందించిన గౌతమ్ సవాంగ్ అభినందించారు. రమ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలో రమ్య ఫ్యామిలీని మానసికంగా వేదిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రమ్య హత్య కేసు దర్యాప్తును కేవలం ఆరు రోజులోనే పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసామని.. ఇక కోర్టులో ట్రైల్ కూడా త్వరగా పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్షపడేలా న్యాయస్థానాన్ని కోరతామని తెలిపారు. మహిళ భద్రత, రక్షణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్.

Also Read:  అంటువ్యాధుల నివారణ కోసం శ్రావణ మాసంలో ఆదివాసీల పండగ.. కర్రగుర్రాల‌పై నడక

Follow Us
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్