Karthika Depam: సూపర్ ట్విస్ట్.. మోనిత బ్రతికే ఉందని తెలుసుకున్న దీప.. నమ్మని కుటుంబం!

కార్తీకదీపం సీరియల్ ప్రతిరోజూ ట్విస్ట్ లతో ఇంటిల్లిపాదినీ అలరిస్తూ దూసుకుపోతోంది..కుటుంబ బంధాల నేపథ్యంలో సాగుతున్న కార్తీకదీపం అందరి మనసులను దోచుకుని అప్రతిహతంగా సాగిపోతోంది.

Karthika Depam: సూపర్ ట్విస్ట్.. మోనిత బ్రతికే ఉందని తెలుసుకున్న దీప.. నమ్మని కుటుంబం!
Karthika Depam Episode 1126
Follow us
KVD Varma

|

Updated on: Aug 24, 2021 | 7:56 AM

Karthika Depam: కార్తీకదీపం సీరియల్ ప్రతిరోజూ ట్విస్ట్ లతో ఇంటిల్లిపాదినీ అలరిస్తూ దూసుకుపోతోంది..కుటుంబ బంధాల నేపథ్యంలో సాగుతున్న కార్తీకదీపం అందరి మనసులను దోచుకుని అప్రతిహతంగా సాగిపోతోంది. ఇప్పటికే 1125 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న కార్తీకదీపం సీరియల్ 1126 వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. ఇప్పటివరకూ జరిగిన కథ ఏమిటో ఒకసారి చూద్దాం..

పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, కార్తీక్ ను పెళ్ళిచేసుకోవాలనే అత్యాశతో నాటకాలతో అతని కాపురాన్ని కూలదోసేందుకు కుయుక్తులు పన్నుతూ వస్తోంది. ఈ క్రమంలో కార్తీక్ లో అనుమాన బీజాలను నాటి అతని భార్య దీపను పదేళ్ల పాటు దూరం ఉంచేలా చేస్తుంది. అయితే, కార్తీక్ దీప మంచితనం తెలుసుకుని ఆమెతో సఖ్యంగా ఉండటం మొదలు పెట్టేసరికి మోనిత రాక్షస ఎత్తు వేసింది. తాను చనిపోయినట్టు సాక్ష్యాలు సృష్టించి.. కార్తీక్ ను కటకటాల పాలు చేసింది. ఈ కేసును చూస్తున్న ఏసీపీ రోషిణి కూడా కార్తీక్ ఈ హత్య చేశాడని బలంగా నమ్ముతోంది.  మరోవైపు మోనిత దీపను చంపి తన కోరిక తీర్చుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడుతుంది. అందుకోసం సోదమ్మ వేషం వేసుకుని దీప పిన్ని భాగ్యంతో సోది చెప్పించుకోవడానికి దీపను తన దగ్గరకు వచ్చేలా ఏర్పాటు చేస్తుంది. దీప అఖండ దీపం పూజ చేయించడానికి వెళుతుంది. దారిలో అంజి, దుర్గ కలుస్తారు. వారికి తానూ గుడికి పూజ చేయించుకోవడానికి వెళుతున్నాను అని చెబుతుంది. వాళ్ళు కూడా వస్తామని అడుగుతారు. కానీ, దీప ఇది ఒక్కరే చేయాల్సిన పూజ మీరెవరూ వద్దని వెళుతుంది. దీప అఖండ దీపం వెలిగిస్తుండగా మోనిత దీపను చంపడానికి రివాల్వర్ తీసుకుని వస్తుంది. రెండు మూడు సార్లు ప్రయత్నాలు చేసినా.. గురి కుదరదు.  టూకీగా ఇదీ కథ..  మరి ఈరోజు ఏం జరిగిందో చూద్దాం..

మోనిత ఎత్తు చిత్తు.. దీప సేఫ్!

దీపను చంపడానికి ప్రయత్నం చేసినా మూడు నాలుగు సార్లు గురి కుదరక పోవడంతో.. మోనిత ఆగిపోతుంది. ఎలానూ సోది చెప్పించుకోవడానికి వస్తుందిగా.. అప్పుడు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో రివాల్వర్ పెట్టి కాల్చాలని అనుకుంటుంది. ఇక ఇంటి దగ్గర పిల్లలు దీప ఏమైందని కంగారు పడుతుంటారు. టిఫిన్ కూడా చేయకుండా దీప కోసం ఏడుస్తూ ఉంటారు. వారిని ఊరుకోపెట్టి.. మంచి మాటలు చెబుతుంది దీప చెల్లి. ఇక మరోవైపు దీప అఖండ దీపం పూజ పూర్తి చేసి బయటకు వస్తుంది. ఈలోపు మోనిత సోది చెబుతాను అంటూ అరుస్తుంది. అది విని అక్కడకు దీప వెళుతుంది. రామ్మా.. నిన్న మీ పిన్ని వచ్చి పోయింది. ఈరోజు నిన్ను నాకాడికి పొమ్మని మీ నాన్న చెప్పి పంపాడు. నీ కష్టాలు ఎవరికీ రాకూడదు. చేయని తప్పుకు నీ పెనిమిటి జైలులో ఉన్నాడు. నువ్వు దుర్గను.. అదే దుర్గమ్మ పూజకు కారులో కాదు కాలినడకన వెళ్ళాలి. అక్కడ దుర్గమ్మకు పూజ చేయాలి అని చెబుతుంది. నువ్వు కొద్దీ సేపు కళ్ళు మూసుకో.. నేను చెప్పేవరకూ కళ్ళు తెరువవద్దు.. అని చెబుతుంది. సరే అని కళ్ళు మూసుకుంటుంది దీప. వెంటనే రివాల్వర్ తీసి ఆమెకు గురిపెడుతుంది మోనిత.

నువ్వు భ్రమ పడుతున్నావు..

సరిగ్గా ట్రిగ్గర్ నొక్కే సమయానికి ఆమెకు తుమ్ము వస్తుంది. దీంతో చేతిలో గన్ జారిపోతుంది. తుమ్మిన వెంటనే ఆమె ఎక్స్క్యూజ్ మీ అని ఇంగ్లీష్ లో అంటుంది. దీంతో దీపకు అనుమానం వస్తుంది. ఆమెను పరీక్షగా చూస్తుంది. ఆమె మోనిత అని దీపకు అర్ధం అయిపోతుంది. వెంటనే మోనిత తన రివాల్వర్ జాగ్రత్త చేసుకుని అక్కడ నుంచి బయలు దేరబోతుంది.. మోనితా ఆగు అని దీప అనే లోపులో అక్కడికి దుర్గ వస్తాడు దీపమ్మా అని పిలుస్తాడు. దుర్గని చూసిన వెంటనే మోనిత షాక్ అవుతుంది. దుర్గ.. వీడిక్కడికి వచ్చాడేమిటి అని కంగారు పడుతూ అక్కడ నుంచి పారిపోతుంది. దీప మోనిత కనిపించింది అని చెబుతుంది దుర్గకు.. మోనిత కనిపించడం ఏమిటి అని అంటాడు దుర్గ.. ఈలోపు అక్కడకి అంజి కూడా వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. మోనిత సోదమ్మ వేషంలో వచ్చింది అని చెబుతుంది దీప. మోనిత బ్రతికే ఉంటె నీకు కనిపించాలని ఎందుకు అనుకుంటుంది.. బయట ఎందుకు తిరుగుతుంది అని అడుగుతారు దుర్గ.. అంజి. ఆమె భ్రమ పడింది అని చెప్పి ఇంటికి పంపించేస్తారు.

దీప మానసిక స్థితి సరిగా లేదు 

అక్కడ ఇంటి దగ్గర అందరూ దీప కోసం కంగారు పడుతుంటారు. భాగ్యాన్ని ఆనందరావు నిలదీస్తాడు. సోది చెబుతారంటే ఎలా నమ్మారు అంటాడు. సౌందర్య దీప కూడా ఇటువంటివి నమ్మదు. కానీ, దీప మానసిక స్థితి ఇప్పుడు బాగాలేదు. ఎదో ఒకదారి దొరకక పోతుందా అని దీప ప్రయత్నిస్తోంది. అందుకే వెళ్లి ఉంటుంది అని చెబుతుంది. ఈలోపు అక్కడికి దీప కంగారుగా వస్తుంది. అందరూ ఏమైంది దీపా అంటారు. దారి దొరికింది అత్తాయ్యా.. పూజారిగారు చెప్పినట్టే దారి దొరికింది అంటుంది దీప. అందరూ ఆందోళనగా ఆమెను చూస్తారు. అవును అత్తయ్యా మోనిత సోదమ్మ వేషంలో వచ్చింది.. అని చెబుతుంది. ఈమె మాటలు ఎవరూ నమ్మరు. ఆమె మానసిక స్థితి సరిగా లేక అలా అంటోంది అనుకుంటారు. సౌందర్య దీపను నువ్వు భ్రమపడుతున్నావు అంటుంది. దానికి నేను చూశాను అని చెబుతుంటే.. చూడని వీళ్లంతా నువ్వు భ్రమ పడుతున్నావు అని అంటారేమిటి? అనుకుంటూ మెట్లపై నుంచి పిల్లల గదికి వెళుతుంది. కింద నుంచి ఆమెను చూస్తున్న సౌందర్య.. చూశారా.. తనలో తానె మాట్లాడుకుంటూ వెళుతోంది అని చెబుతుంది.

ఇదీ ఈ రోజు ఎపిసోడ్ (1126) లో జరిగిన కథ.. మరి దీప మాటను ఎవ్వరూ నమ్మలేదు.. దీప ఇప్పుడేం చేస్తుంది. కార్తీక్ మోనిత బ్రతికే ఉందని చెబితే ఎలా రియాక్ట్ అవుతాడు? మోనిత దీపను చంపలేక పోయినందుకు.. ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే రేపు ప్రసారం అయ్యే ఎపిసోడ్ 1127 వరకూ ఆగాల్సిందే.

మరిన్ని కార్తీకదీపం కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. గుడిలో కుప్పకూలిన వంటలక్క!

Karthika Deepam: మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను..సౌందర్యకు షాకిచ్చిన ఏసీపీ రోషిణి!

Karthika Deepam: దీపను కొండెక్కేలా చేస్తాను అంటూ రోడ్డెక్కిన మోనిత!

Karthika Deepam: దీపను చంపేస్తాను..కార్తీకదీపంలో మోనిత ఆట మళ్ళీ మొదలైంది..

Karthika Deepam: కార్తీకదీపంలో పెద్ద ట్విస్ట్..మోనిత కొత్త నాటకం …