AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. గుడిలో కుప్పకూలిన వంటలక్క!

కుటుంబ బంధాల నేపథ్యంలో ఆసక్తికరంగా సాగిపోతోంది కార్తీకదీపం సీరియల్. ప్రతిరోజూ ఇంటిల్లపాదినీ ఆకట్టుకుంటూ.. ఉత్కంఠభరితమైన మలుపులతో కార్తీకదీపం తెలుగు టీవీ సీరియల్స్ చరిత్రలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. గుడిలో కుప్పకూలిన వంటలక్క!
Karthika Deepam Episode 1125
KVD Varma
|

Updated on: Aug 23, 2021 | 7:22 AM

Share

Karthika Deepam: కుటుంబ బంధాల నేపథ్యంలో ఆసక్తికరంగా సాగిపోతోంది కార్తీకదీపం సీరియల్. ప్రతిరోజూ ఇంటిల్లపాదినీ ఆకట్టుకుంటూ.. ఉత్కంఠభరితమైన మలుపులతో కార్తీకదీపం తెలుగు టీవీ సీరియల్స్ చరిత్రలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇప్పటికే 1124 ఎపిసోడ్లను పూర్తిచేసుకున్న కార్తీకదీపం ఈరోజు 1125 ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. కార్తీకదీపం సీరియల్ కు అక్షరరూపం ఇక్కడ ఇస్తున్నాం.

ఇప్పటివరకూ ఏమైందంటే..

మోనితను హత్య చేశాడనే నేరంపై ఏసీపీ రోషిణి కార్తీక్ ని లాకప్ లో పెడుతుంది. అతన్ని విడిపించాలని దీప ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోవైపు మోనిత కార్తీక్ ని పెళ్లి చేసుకోవడం కోసం తానూ చనిపోయినట్టు నాటకం ఆడి.. కార్తీక్ ను పోలీసుల పాలు చేస్తుంది. తరువాత దీపను చంపి కార్తీక్ తో హాయిగా ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అందుకోసం సోది చెప్పేదానిలా వేషం మార్చుకుని దీప పిన్నికి దీప కష్టాల్లో బయటపడాలంటే.. ఒంటరిగా గుడివద్దకు వస్తే తనకి మార్గం చెబుతానని నమ్మబలుకుతుంది. అదేసమయంలో దీపతో అఖండదీపం పూజ చేయిస్తానని గుడిలో పూజారి చెబుతాడు. ఈ విషయాన్ని దీపకు చెబుతుంది భాగ్యం. తాను పూజ చేయించడానికి వెళతానని దీప చెబుతుంది. ఇక కార్తీక్ ను విడిపించాలని ఏసీపీ రోషిణితో మాట్లాడటానికి వెళుతుంది సౌందర్య. అయితే.. అక్కడ ఆమెకు షాకిస్తుంది రోషిణి. మోనిత చనిపోయిన ప్రాంతంలో ఒకటే బుల్లెట్ దొరికిందని.. ఆ తుపాకీ సౌందర్య లైసెన్స్ తో ఉన్నది కాబట్టి మిస్ అయిన రెండో బుల్లెట్ ఏమైందో లెక్కచెప్పమని అడుగుతుంది. లెక్కచెప్పకపోతే ఆమెనూ అరెస్ట్ చేస్తానని వార్ణింగ్ ఇస్తుంది ఏసీపీ రోషిణి. ఇదీ ఇప్పటి వరకూ జరిగిన కథ. ఇక ఈరోజు ఎపిసోడ్ (1125)లో ఏం జరగబోతోందో తెలుసుకుందాం.

దీపను ఎలా చంపాలి?

దీప పూజ చేయించడానికి వెళ్ళడానికి ఉదయాన్నే సిద్ధం అయిపోతుంది. వారణాశి ఆమెను కారులో తీసుకువెళతాడు. కారులో వెళుతూ దీప ఈ పూజతో అయినా కార్తీక్ బయటపడే మార్గం దొరికితే బావుండునని అనుకుంటుంది. ఈలోపు వారణాశి.. అక్కా ఇంత పొద్దున్నే ఎక్కడికి అక్కా అని అడుగుతాడు. గుడిలో పూజకోసం అని చెబుతుంది దీప. మోనిత పూజ చేస్తే బతికి వస్తుందా అని అడుగుతాడు వారణాశి. మోనిత బతికి ఉంటేనే డాక్టర్ బాబు బయటకు రాగలుగుతారు అని చెబుతాడు. ఇక దీపను ఎలా చంపాలా అని ఆలోచిస్తూ సోదమ్మ వేషం వేసుకుంటూ రెడీ అయిపోతుంది మోనిత. ఏక్సిడెంట్ చేసి చంపాలని మొదట అనుకుని.. తరువాత రివాల్వర్ తో కాల్చి చంపాలని అనుకుంటుంది.

నేను మోనితను లవ్ చేస్తున్నాను..

అంజి..దుర్గ ఇద్దరూ జాగింగ్ చేస్తుంటారు. అంజి ఇక నావల్ల కాదు అని ఆగిపోతాడు. దానికి దుర్గ మనం ఫిట్ గా ఉండాలి. లేకపోతె పోలీసుల నుంచి పారిపోవడం కష్టం అవుతుంది అంటాడు. ఇక మనం మామూలు జీవితం గడుపుదాము అని అంజి చెబుతాడు. ఇలా లేకపోతె మనల్ని బ్రతకనీయరు అంటాడు దుర్గ. సరే అయితే, డాక్టర్ బాబును బయటకు తీసుకువచ్చేదాకా మనం ఇలానే మంచిగా ఉండి.. మోనిత ఎక్కడుందో కనిపెట్టాలి అని అంజి అంటాడు. దానికి దుర్గ మోనిత నీకు దొరికితే చంపేయకు.. నాకు అప్పగించు.. నేను ఆమెను లవ్ చేస్తున్నాను అంటాడు. దానికి అంజి.. మోనిత లాంటి దానిని లవ్ చేసేవాడూ ఉంటాడా అంటాడు. నేనున్నానుగా అంటాడు దుర్గ. నీకు కలిసొచ్చే కాలం వచ్చింది ఫో అని నవ్వుతాడు అంజి. అదేంటి అని ప్రశ్నిస్తాడు. నడిచొచ్చే కొడుకు నీకు మోనితతో పాటు వస్తాడుగా.. ఎందుకంటే మోనిత ఇప్పుడు గర్భవతి. అని చెబుతాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా దీప అక్కడకు వస్తుంది. వాళ్ళిద్దరినీ పలకరిస్తుంది. తాను పూజ చేయించడానికి గుడికి వెళుతున్నానని వాళ్ళకి చెబుతుంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకో.. మేము మోనిత సంగతి తెలుస్తాము అంటాడు దుర్గ. సరే అని దీప వెళ్ళిపోతుంది.

అమ్మెక్కడికి వెళ్ళింది?

ఉదయాన్నే తల్లి కనబడటం లేదని సౌందర్యను అడుగుతుంది సౌమ్య. నాకూ తెలియదు అని చెబుతుంది సౌందర్య. అమ్మ వస్తే నా దగ్గరకు పంపించు అని చెప్పి వెళ్ళిపోతుంది సౌర్య. కార్తీక్ మోనితను చంపలేదనే విషయం చెబుదామని అనుకుంటే.. దీప ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచనలో పడుతుంది సౌందర్య.

దీపను తుపాకీతో కాల్చిన మోనిత?

ఇక గుడి వద్దకు దీప.. మోనిత చేరుకుంటారు. పంతులు పూజ మొదలు పెడతాడు. దీపను చంపడం కోసం రివాల్వర్ పట్టుకుని మోనిత సిద్ధం అవుతుంది. పూజారి దీపకు ఈ పూజతో నీకు ఆత్మస్థైర్యంతో పాటు.. దైవ బలం కూడా తోడవుతుంది అంటాడు. అఖండ దీపం వెలిగించడానికి దీప సిద్ధం అవుతుంది. మోనిత ఆమెను రివాల్వర్ తో కాలుస్తుంది. దీప ఒక్కసారే వెనక్కి విరుచుకుపడిపోతుంది. ఆమెను పక్కనే ఉన్న పూజారి పట్టుకుంటాడు.

ఇదీ ఈ రోజు ఎపిసోడ్ (1125) లో జరిగిన కథ.. మరి దీప చనిపోయిందా.. మోనిత అంజికి దొరికిందా? కార్తీక్ స్టేషన్ నుంచి బయటకు వస్తాడా? ఈ విషయాలన్నీ తెలియాలంటే రేపు  ప్రసారం అయ్యే ఎపిసోడ్ 1126 వరకూ ఆగాల్సిందే.

మరిన్ని కార్తీకదీపం కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karthika Deepam: మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను..సౌందర్యకు షాకిచ్చిన ఏసీపీ రోషిణి!

Karthika Deepam: దీపను కొండెక్కేలా చేస్తాను అంటూ రోడ్డెక్కిన మోనిత!

Karthika Deepam: దీపను చంపేస్తాను..కార్తీకదీపంలో మోనిత ఆట మళ్ళీ మొదలైంది..

Karthika Deepam: కార్తీకదీపంలో పెద్ద ట్విస్ట్..మోనిత కొత్త నాటకం …

Karthika Deepam: నీ భర్త మోనితను చంపేశాడు.. దీపకు షాక్ ఇచ్చిన రోషిణి..అంతా వాళ్ళే చేశారంటున్న కార్తీక్!