Karthika Deepam: మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను..సౌందర్యకు షాకిచ్చిన ఏసీపీ రోషిణి!

కార్తీకదీపం సీరియల్..ఎన్నిరోజులైనా..ఎప్పటికప్పుడు ప్రతిరోజూ కొత్తగా బుల్లితెర ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. రోజుకో ట్విస్ట్ తో విజయంతంగా సాగిపోతోంది కార్తీకదీపం. కుటుంబ బంధాల మధ్యలో.. ఉన్మాద ప్రేమ ప్రవేశిస్తే ఏం జరుగుతుందో..

Karthika Deepam: మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను..సౌందర్యకు షాకిచ్చిన ఏసీపీ రోషిణి!
Karthika Deepam Episode 1124
Follow us

|

Updated on: Aug 21, 2021 | 8:17 AM

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్..ఎన్నిరోజులైనా..ఎప్పటికప్పుడు ప్రతిరోజూ కొత్తగా బుల్లితెర ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. రోజుకో ట్విస్ట్ తో విజయంతంగా సాగిపోతోంది కార్తీకదీపం. కుటుంబ బంధాల మధ్యలో.. ఉన్మాద ప్రేమ ప్రవేశిస్తే ఏం జరుగుతుందో.. మనిషి విచక్షణ కోల్పోతే ఎటువంటి పరిణామాల్లో చిక్కుకుపోతాడో.. అనుమానం అనే భూతం మనుషుల మధ్యలో ఎలాంటి అగచాట్లను తీసుకువస్తుందో కార్తీకదీపం సీరియల్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. అందుకే ఇప్పటికి 1123 ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఈరోజు 1124వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. మరి ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం..

నిన్నటి ఎపిసోడ్ (1123)లో ఏం జరిగిందంటే..

కార్తీక్ ను చూడటం కోసం వెళ్ళిన పిల్లల ముందే కార్తీక్ ను అవమానిస్తుంది ఏసీపీ రోషిణి. పిల్లలను ఇంటికి తీసుకువచ్చిన దీప వాళ్ళకు సర్ది చెప్పి.. బాగా చదువుకోమని చెబుతుంది. మరోవైపు సౌందర్య, ఆనందరావు తమ కొడుకు కార్తీక్ ను ఏ విధంగా బయటకు తీసుకురావాలా అని ఆలోచిస్తుంటారు. దీప కూడా కార్తీక్ ను బయటకు తీసుకువచ్చే మార్గం కోసం మధనపడుతుంటుంది. ఇక దీప పిన్ని భాగ్యం భర్తను తీసుకుని గుడి వద్దకు వెళుతుంది. అక్కడ పూజారితో మాట్లాడి మర్నాడు దీపతో అఖండ దీపం పూజ చేయించడానికి ఏర్పాటు చేస్తుంది. ఈలోపు దీప గుడికి వెళుతుంది అని తెలుసుకున్న మోనిత దీపను చంపడానికి సోది చెప్పే ఆమె వేషంలో గుడి వద్దకు వస్తుంది. అయితే, దీప రాలేదని తెలుసుకున్న మోనిత.. భాగ్యం దగ్గర కొత్త నాటకం ఆడుతుంది. సోది చెప్పినట్టు నటించి.. కార్తీక్ బయటపడాలంటే దీప మర్నాడు ఉదయం ప్రత్యేకంగా పూజ చేయాలనీ.. తాను ఆ పూజ చేయిస్తాననీ చెబుతుంది. దీంతో భాగ్యం..ఆమె భర్త సరే అని ఒప్పుకుని వెళతారు. దీపను హత్య చేయడానికి సిద్ధం అవుతుంది మోనిత.

నేను చంపలేదు..

కార్తీక్ ను ప్రశ్నిస్తుంటుంది ఏసీపీ రోషిణి. ఎన్నివిధాలుగా అడిగినా..తాను మోనితను చంపలేదని చెబుతాడు కార్తీక్. అయితే, అతని మాటలు నమ్మదు రోషిణి. తనని ఏమార్చడం కోసం కట్టుకథలు చెబుతున్నాడని అనుకుంటుంది. మోనితను గర్భవతిని చేసి ఇప్పుడు ఇలాంటి నాటకాలు ఆడుతున్నావు అంటుంది. మీరు డాక్టర్ కాబట్టి మర్యాదగా అడుగుతున్నాను. కానీ.. మిమ్మల్ని ఫిజికల్ గా హ్యాండిల్ చేసే పరిస్థితి తీసుకురాకండి అని హెచ్చరిస్తుంది.

మోనిత చనిపోయి ఉండదు..

దుర్గ..అంజి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. జైలు నుంచి ఎప్పుడు వచ్చావు అని దుర్గని అడుగుతాడు అంజి. మోనిత చచ్చిన రోజు అని చెబుతాడు అంజి. అంటే మోనితను నువ్వు చంపావా? అని అంజి అడుగుతాడు. లేదు అని చెబుతాడు దుర్గ.. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా దీప..వారణాసి అక్కడకు వస్తారు. దీపను చూసిన దుర్గ ఆమెకు ఎదురు వెళ్లి.. అమ్మా దీపమ్మా నిన్ను చూసి ఎన్నాళ్లయింది అంటాడు. తరువాత కార్తీక్ హత్య చేసి ఉండడని అంజి అంటాడు. అసలు మోనిత చనిపోయి ఉండదు.. అని చెబుతాడు అంజి. అసలు ఏమి జరిగిందో వివరంగా చెప్పమని దుర్గ అడుగుతాడు. దీప జరిగింది అంతా చెబుతుంది. దీంతో అంజి.. అంటే భాగ్యం గారు డాక్టర్ బాబు కాల్చడం చూడలేదు కదా అని అంటాడు. అవును అని దీప చెబుతుంది. దీంతో దుర్గ, అంజి ఇద్దరూ ఒక అభిప్రాయానికి వస్తారు. డాక్టర్ బాబు తను మోనితను చంపలేదు అనే ఒక్క విషయం ఆయన దగ్గర నుంచి తెలుసుకోండి. నేను ఆమె ఎక్కడుందో కనిపెడతాను అని దుర్గ చెబుతాడు. దానికి సరే అని దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

నీకు నేను ఉద్యోగం ఇస్తాను..

మోనిత ఇంటివద్ద కానిస్టేబుల్ రామసీతతో కలసి భోజనం చేస్తుంటుంది. రామసీత మోనిత తో ”చనిపోతుందని అనుకున్న మా అక్కను చివరి క్షణాల్లో బ్రతికించారు మేడం. అందుకే మీకు చట్టవిరుద్ధం అని తెలిసినా సహాయం చేస్తున్నాను. ఈ విషయం మా రోషిణి మేడంకి తెలిస్తే నా పరిస్థితి ఏమైపోతుందో అని అంటుంది. దానికి మోనిత.. ఏమీ ఫర్వాలేదు.. నీ ఉద్యోగం పోయినా మన హాస్పటల్ లో నీకు మంచి ఉద్యోగం ఇస్తాను. నీ కుటుంబం మొత్తాన్ని ఏ లోటూ రానీయకుండా చూసుకుంటాను అని చెబుతుంది మోనిత. సరే అని చెప్పి రామసీత వెళ్ళిపోతుంది. తరువాత మోనిత ఇంకొక్క రోజు దీపా.. రేపు ఉదయం నిన్ను చంపేస్తాను. అని అనుకుంటుంది.

దీప పిల్లలకు భోజనం పెడుతుంటుంది. ఈలోపు అక్కడికి భాగ్యం..ఆమె భర్త ఇద్దరూ వస్తారు. దీపతో గుడిలో జరిగిన విషయం చెబుతారు. సోది చెప్పించుకుంటే మంచిది అని చెబుతారు. మర్నాడు ఉదయం పంతులు గారు అఖండ దీపం పూజ చేయిస్తారు.. తరువాత సోది చెప్పే ఆవిడను కలవమని దీపకు చెబుతారు. సరే నాన్నా..మానవ ప్రయత్నానికి దైవ సహాయం కూడా ఉంటె డాక్టర్ బాబు బయటకు వచ్చేస్తారేమో.. నేను వెళ్లి పూజ చేయించుకుంటాను అని చెబుతుంది.

మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను..

మరోవైపు ఏసీపీ రోషిణి ఇంటికి సౌందర్య వస్తుంది. ఆమెతో మాట్లాడాలని చెబుతుంది. అక్కడ రోషిణి మీ కొడుకు ఇప్పుడు మాట మార్చాడు. తాను హత్య చేయలేదు అంటున్నాడు అని చెబుతుంది. దీంతో సౌందర్య.. వాడు నిర్దోషి. మీరు అనవసరంగా లాకప్ లో పెట్టారు అని చెబుతుంది. దానికి రోషిణి కడుపుతీపితో మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది. తరువాత సౌందర్యకు.. రోషిణికి మధ్య ఈ విషయంలో చాలా వాదన జరుగుతుంది. మోనిత శవం ఎక్కడుందో తెలుసుకోండి అని రోషిణి సౌందర్యతో అంటుంది. దీంతో సౌందర్య అది నా పని కాదు. మోనిత గురించి నాకు అవసరం లేదు. మీరు తెలుసుకోవలసిన విషయం అంటుంది సౌందర్య. అంతేకాకుండా.. నా కొడుకు నిర్దోషి అని రుజువు చేసి బయటకు తీసుకువస్తాను.. అని ఛాలెంజ్ చేస్తుంది. అక్కడ నుంచి వెళ్ళడానికి రెడీ అవుతుంది. దీంతో సౌందర్యనుఒక్కసారి ఆగమని రోషిణి చెబుతుంది. మీ కొడుకును మీరు నిర్దోషిగా బయటకు తీసురండి ఏదైనా చేసుకోండి.. మిసెస్ సౌందర్య ఆనందరావు.. నాకు ఒక సంగతి చెప్పండి. మీ లైసెన్స్ రివాల్వర్ నుంచి రెండు బుల్లెట్లు మిస్ అయ్యాయి. ఒకటి మోనితను హత్య చేయడానికి మీ అబ్బాయి వాడాడు. అది దొరికింది. మరి రెండో బులెట్ ఏమైనట్టు అని అడుగుతుంది రోషిణి. మీకు ఒక్కరోజు సమయం ఇస్తున్నాను. రెండో బుల్లెట్ ఏమైంది అనే లెక్క నాకు చెప్పాలి. లేకపోతే.. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అని చెబుతుంది. దీంతో షాక్ అయిన సౌందర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఇదీ ఈ రోజు ఎపిసోడ్ (1124) లో జరిగిన కథ..  మరి దీప పూజ చేయించుకోవడానికి వెళ్ళిందా? మోనిత ఆమెను చంపడానికి వచ్చిందా? సౌందర్య ఏమి చేస్తుంది? వంటి విషయాలు తెలియాలంటే సోమవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ 1125 వరకూ ఆగాల్సిందే.

మరిన్ని కార్తీకదీపం కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karthika Deepam: దీపను కొండెక్కేలా చేస్తాను అంటూ రోడ్డెక్కిన మోనిత!

Karthika Deepam: దీపను చంపేస్తాను..కార్తీకదీపంలో మోనిత ఆట మళ్ళీ మొదలైంది..

Karthika Deepam: కార్తీకదీపంలో పెద్ద ట్విస్ట్..మోనిత కొత్త నాటకం …

Karthika Deepam: నీ భర్త మోనితను చంపేశాడు.. దీపకు షాక్ ఇచ్చిన రోషిణి..అంతా వాళ్ళే చేశారంటున్న కార్తీక్!

Karthika Deepam: మీ అమ్మనూ చంపేస్తాను..నిస్సిగ్గుగా నిజాలు కక్కిన మోనిత..నిజాలు విని కార్తీక్ షాక్..!

సింహ రాశిలోకి బుధుడు.. వారికి కొత్త ప్రయత్నాల్లో సక్సస్ పక్కా..
సింహ రాశిలోకి బుధుడు.. వారికి కొత్త ప్రయత్నాల్లో సక్సస్ పక్కా..
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు స్పీకర్ తెచ్చుకోవద్దు: కేటీఆర్
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు స్పీకర్ తెచ్చుకోవద్దు: కేటీఆర్
గోవా నుంచి లిక్కర్ బాటిళ్లు తెచ్చాడు.. ఇన్‌స్టా రీల్‌లో హీరోలా..
గోవా నుంచి లిక్కర్ బాటిళ్లు తెచ్చాడు.. ఇన్‌స్టా రీల్‌లో హీరోలా..
వర్షాకాలంలో తలుపుల నుంచి వచ్చే చప్పుడును ఈ చిట్కాలతో తగ్గించండి..
వర్షాకాలంలో తలుపుల నుంచి వచ్చే చప్పుడును ఈ చిట్కాలతో తగ్గించండి..
తీసుకున్న విశ్రాంతి చాలు.. సీనియర్లకు షాకిచ్చిన గంభీర్
తీసుకున్న విశ్రాంతి చాలు.. సీనియర్లకు షాకిచ్చిన గంభీర్
ఇత్తడి పాత్రలో టీ పెట్టి తాగితే.. ఇన్ని ప్రయోజనాలా..
ఇత్తడి పాత్రలో టీ పెట్టి తాగితే.. ఇన్ని ప్రయోజనాలా..
BH సిరిస్‌ కలిగిన నంబర్‌ ప్లేట్‌ ఎవరికి కేటాయిస్తారు?
BH సిరిస్‌ కలిగిన నంబర్‌ ప్లేట్‌ ఎవరికి కేటాయిస్తారు?
వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?