AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika Konidela: బిగ్ బేబీ బ్రదర్‌తో రాఖీ సెలబ్రేషన్స్ .. ఈ ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టండి అంటున్న నిహారిక

Neeharika Konidela: మెగా ఫ్యామిలీలో ఆగస్ట్ 22న సంబరాలు అంబరాన్ని అంటాయి. ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. మరోవైపు అన్న చెల్లల అనుబంధాన్ని తెలిపే రాఖీ పౌర్ణమి పండగ ..

Niharika Konidela: బిగ్ బేబీ బ్రదర్‌తో రాఖీ సెలబ్రేషన్స్ .. ఈ ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టండి అంటున్న నిహారిక
Niharika
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 24, 2021 | 11:31 AM

Share

Neeharika Konidela: మెగా ఫ్యామిలీలో ఆగస్ట్ 22న సంబరాలు అంబరాన్ని అంటాయి. ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. మరోవైపు అన్న చెల్లల అనుబంధాన్ని తెలిపే రాఖీ పౌర్ణమి పండగ .. ఈ రెండిటిని మెగా ఫ్యామిలీ ఘనంగా జరుపుకున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ అంటేనే సందడి. ఎక్కడ చూసినా చిరు నామస్మరణతో మారుమ్రోగిపోయింది.

ఓ వైపు చిరంజీవి తన ఫ్యామిలీ సభ్యులు అన్నదమ్ములు, అల్లు అరవింద్ ఫ్యామిలీల మధ్య కేక్ కంటింగ్ చేశారు.. మరోవైపు ఫ్యామిలీ మొత్తం ఆడ, మగ, చిన్నా, పెద్దా అందరూ కలిసి రాఖీ పౌర్ణమిని ప్రేమానురాగాలతో సెలబ్రేట్ చేసుకున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు మాధవి, విజయ దుర్గలు రాఖి కట్టారు.

ఇక రామ్ చరణ్, వరుణ్ తేజ్ లకు అక్కచెల్లెలు అయిన సుస్మిత, శ్రీజ, నిహారిక లు రాఖీ కట్టారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. కూడా అయితే.. ఇంత ఆనందంలో కూడా మెగా అభిమానుల్లో ఒక చిన్న ఫీలింగ్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరాకు కూడా మెగా డాటర్స్ రాఖీ కడితే బాగుండుని అని ఒక్క భావం కలిగింది… ఇదే విషయాన్నీ చాలా మంది అభిమానులు సోషల్ మీడియా వేడికాగా వెల్లడించారు.. అయితే తాజాగా మెగా బ్రదర్ తనయ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. కొంచెం ఆలస్యం.. కానీ రాఖీ పండగకు చాలా సంతోషంగా ఉంది.. బిగ్ బేబీ బ్రదర్ అంటూ ఆ ఫోటోకి ఓ కామెంట్ కూడా జత చేసింది. అంతేకాదు ఆ ఫొటోలో నిహారిక కౌగిలించుకున్న తమ్ముడి ఫేస్ ని రివీల్ చేయకుండా ఫ్యాన్స్ కు , నెటిజన్ల మెదడుకు పదును పెట్టేలా ఎవరో గుర్తు పట్టండి అని ఆ బేబీ బ్రదర్ ఎవరో చూసేవారికి ఆలోచనకు వదిలేసింది. అయితే ఆ హైట్ పర్సనాలిటీని బట్టి.. ఆ తమ్ముడు పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఈ ఫోటో అటు మెగా అభిమానుల‌తో పాటు ఇటు పవన్ ఫ్యాన్స్ కు    మామూలు కిక్ ఇవ్వ‌ట్లేదు.

Also Read:  డీజీపీని కలిసిన రమ్య ఫ్యామిలీ.. తమను వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని విన్నపం

సావిత్రి చేతిలో చిన్నారి బాలుడు.. నేడు టాలీవుడ్‌లో స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా..

నెల ముందు నుంచే ఈ లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం..!

గాడ్ ప్రామిస్ నమ్మండి.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. Viral Videoపై స్పందించిన ఆర్జీవీ