AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: గాడ్ ప్రామిస్ నమ్మండి.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. Viral Videoపై స్పందించిన ఆర్జీవీ

RGV: రాం గోపాల్ వర్మ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. నిత్యం ఏదో ఒక వివాదం లేకపోతే ఆయనకు అసలు కిక్కే ఉండదు. ఏదైనా నిర్మొహమాటంగా..

RGV: గాడ్ ప్రామిస్ నమ్మండి.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. Viral Videoపై స్పందించిన ఆర్జీవీ
RGV Viral Video
Janardhan Veluru
|

Updated on: Aug 22, 2021 | 7:28 PM

Share

RGV Viral Video: రాంగోపాల్ వర్మ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. నిత్యం ఏదో ఒక వివాదం లేకపోతే ఆయనకు అసలు కిక్కే ఉండదు. ఏదైనా నిర్మొహమాటంగా..ఎలాంటి భయం లేకుండా మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతూ నిత్యం మీడియా నోళ్లలో నానుతుంటారీ టాలీవుడ్ టు బాలీవుడ్ డైరెక్టర్. తన క్రియేటివిటీ, నోటితీటపై తనను ఎవరైనా ఆడిపోసుకున్నా ఏ మాత్రం పట్టించుకోరు. తనపై తానే కాస్త ఘాటైన సెటైర్లూ వేసుకోగలరు.  తాజాగా సోషల్ మీడియాలో ఆయన నెటిజన్ల ఆగ్రహానికి గురైయ్యారు. ఇంతకీ వివాదం ఏంటంటే ఆయన ఓ యువతి బర్త్‌డే కేక్ కట్ చేయడం.. ఆమెతో కలిసి డ్యాన్స్ చేయడం. అంత మాత్రానికే వివాదం ఎందుకనేగా మీ డౌట్. ఆయన సదరు మహిళ పట్ల చాలా  అసభ్యకరంగా ప్రవర్తించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలంటే ఆర్జీవీకి చాలా చులకన..మరోసారి ఈ వీడియో ద్వారా ఈ విషయం బయటపడిందని నెటిజన్స్ విమర్శిస్తున్నారు.

అదే సమయంలో ఆర్జీవీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటిలానే తమ క్రియేటివ్ గాడ్‌ భజన చేస్తున్నారు. ఆర్జీవీ డ్యాన్స్ ఆహా ఓహో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆర్జీవీలో దాగిన డ్యాన్స్ ట్యాలెంట్‌కు ఈ వీడియో అద్దంపడుతోందని కామెంట్స్ చేస్తున్నారు. సార్.. మీ డ్యాన్స్ సూపర్.. మీరు ఇంత బాగా డ్యాన్స్ చేయగలరన్న విషయం తనకు ఇన్ని రోజులు తెలీదని ఓ ఫ్యాన్ కామెంట్ చేశాడు.

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న తన వీడియోపై ఆర్జీవీ ట్విట్టర్‌లో స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని చెప్పుకొచ్చారు. బాలాజి, గణపతి, జీసస్ సాక్షిగా ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ నాస్తికుడని చెప్పుకునే ఆర్జీవీ. దేవుళ్ల మీద ప్రామిస్ చేయడం ద్వారా ఆ వీడియోలో ఉన్నది తానేనని ఆర్జీవీ చెప్పకనే చెబుతున్నట్లున్నారు.

Also Read..

ఉత్తేజ్ కూతురు పాటకు అకీరా మ్యూజిక్.. ఫిదా అయిపోతున్న ఫ్యాన్స్.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

జబర్దస్త్‌ సెలబ్రెటీల రాఖీ పండగ సెలబ్రేషన్స్.. ఇమాన్యుయేల్‌కు రాఖీ కట్టిన రోహిణి