AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun Pooja Hegde: అల్లు అర్జున్, పూజాహెగ్డే కాంబినేషన్ మళ్లీ రిపీట్‌కానుందా..!

Allu Arjun Pooja Hegde combination: అల్లుఅర్జున్, పూజహెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని

Allu Arjun Pooja Hegde: అల్లు అర్జున్, పూజాహెగ్డే కాంబినేషన్ మళ్లీ రిపీట్‌కానుందా..!
Allu Arjunpooja Hegde
uppula Raju
|

Updated on: Aug 23, 2021 | 7:22 PM

Share

Allu Arjun Pooja Hegde combination: అల్లుఅర్జున్, పూజహెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికి తెలిసిందే. ఆన్ స్క్రీన్‌పై వీరిద్దరి కాంబినేషన్ మంచి కెమిస్ట్రీని వర్కట్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్. గతంలో వీరిద్దరు కలిసి నటించిన దువ్వాడ జగన్నాధం, అలా వైకుంఠపురము సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి. అలా వైకుంఠపురం సినిమా అయితే తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించాయి. తాజాగా టాలీవుడ్‌లో సంచలనం ఏమిటంటే పూజా హెగ్డే తన తదుపరి చిత్రంలో మళ్లీ అల్లు అర్జున్‌తో జతకట్టబోతుందని తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే, దర్శకుడు శ్రీరామ్ వేణు కొత్త సినిమా కోసం వీరిద్దరూ కలిసి నటించవచ్చు. అల్లు అర్జున్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం చివర్లో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. శ్రీరామ్ వేణు ఈ సినిమా కోసం పూజా హెగ్డేని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిగాయని తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం.

కానీ పూజాహెగ్డే తో మాత్రమే ఆయన రెండు సినిమాలలో నటించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓకే అయితే హ్యాట్రిక్ కాంబినేషన్ అవుతుంది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఇతర హీరోలు ఒకే నటితో చాలా చిత్రాలు చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం వీరికి పూర్తి భిన్నంగా ఉంటారు. అయితే టాలీవుడ్‌‌‌లో ప్రస్తుతం బుట్ట బొమ్మ హంగామా నడుస్తోంది. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది.. ఆతర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.

Actress Priyanka Pandit: మరో భోజ్‌పురి నటి ప్రైవేటు వీడియో లీక్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌..!

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. కొద్దిసేపట్లో అధికారిక ప్రకటన!

AP Corona: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!