Meera Mithun: మీరా మిథున్‌కు మరోసారి షాక్.. దళితులపై విమర్శల విషయంలో కోర్టు తీర్పు ఏంటంటే..
మీరా మిథున్.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్న పేరు. ఇందుకు కారణం ఆమె చేసిన వ్యాఖ్యలు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో
మీరా మిథున్.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్న పేరు. ఇందుకు కారణం ఆమె చేసిన వ్యాఖ్యలు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దళితులు, సామాజిక వర్గాల వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మీరా మిథున్. ఈ క్రమంలో మోడల్, నటి మీరా మిథున్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు. తాజాగా జరిగిన విచారమలో మీరా మిథున్‌కు బెయిల్ ఇచ్చేందుకు చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నిరాకరించింది. అలాగే ఆమె స్నేహితుడు అభిషేక్ కూడా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు సోమవారం కొట్టివేసింది.
ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో దళితులు సినీ పరిశ్రమలో ఉండకూడదని..వారిని ఇండస్ట్రీ నుంచి తరిమేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ నటిని అరెస్ట్ చేయాలని తమిళ ప్రజలు డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఆమెను వీలైనంత తొందరగా అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే మీరా మిథున్ పోలీసుల పిలుపును పెడ చెవిన పెట్టడమే కాకుండా.. తనను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుందని.. నిజ జీవితంలో జరగదని.. వీలైతే అరెస్ట్ చేయాలని పోలీసులకే సవాలు విసిరింది. దీంతో రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు… కేరళలో దాక్కున్న నటి మీరా మిథున్‌ను అరెస్ట్ చేశారు. ఇక ఆ సమయంలోనూ మీరా మిథున్ చేసిన హాంగామా గురించి తెలిసిన విషయమే. తనను అరెస్ట్ చేస్తే కత్తి పొడుతుకుని ఆత్మహత్య చేసుకుంటానని.. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారంటూ ఓ వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. ప్రతి ఒక్కరు, పోలీసులు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నన్ను టచ్ చేస్తే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించింది. ముఖ్యమంత్రి.. ఒక అమ్మాయికి ఇలా జరగవచ్చా ? ఒక అమ్మాయికి ఇదే జరుగుతుందా ? అందరిని బయటకు వెళ్లమని చెప్పండి. నన్ను అరెస్ట్ చేస్తే ఇక్కడే కత్తితో పొడుచుకుని చనిపోతాను. ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ..ఇది తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస అంటూ ఆ వీడియోలో వాపోయింది. ఇక ప్రస్తుతం జైల్లో ఉన్న మీరా.. తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన కోర్టు.. సోమవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ మరోసారి విచారణకు రాగా.. కోర్టు ఆమెతోపాటు.. ఆమె స్నేహితుడి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
Also Read: Maha Ganesha: ఆహా మరో ముందడుగు.. పిల్లల కోసం ప్రత్యేకంగా మహా గణేశ.. వినోదంలో మరింత జోష్..