Maha Ganesha: ఆహా మరో ముందడుగు.. పిల్లల కోసం ప్రత్యేకంగా మహా గణేశ.. వినోదంలో మరింత జోష్..

ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సూపర్ హిట్ సినిమాలను, యాక్షన్ సస్పెన్స్ వెబ్ సిరీస్‏లను, సెలబ్రెటీస్ టాల్క్ షోస్ అంటూ సరికొత్త వినోదాన్ని అందిస్తూ.. వారికి మరింత చెరువవుతోంది

Maha Ganesha: ఆహా మరో ముందడుగు.. పిల్లల కోసం ప్రత్యేకంగా మహా గణేశ.. వినోదంలో మరింత జోష్..
Maha Ganesha
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Aug 24, 2021 | 7:54 PM

ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సూపర్ హిట్ సినిమాలను, యాక్షన్ సస్పెన్స్ వెబ్ సిరీస్‏లను, సెలబ్రెటీస్ టాల్క్ షోస్ అంటూ సరికొత్త వినోదాన్ని అందిస్తూ.. వారికి మరింత చెరువవుతోంది తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇతర ఓటీటీ సంస్థలకు పోటీనిస్తూ.. డిజిటల్ రంగంలో దూసుకుపోతుంది ఆహా. థియేటర్లు ఓపెన్ అయినా.. ఆహా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. కంటెంట్ ప్రాధాన్నత ఉన్న సినిమాలే కాకుండా.. ప్రేక్షకుల కోసం సరికొత్త వినోదాన్ని అందించడంలో ఆహా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఈ ఓటీటీ మాధ్యమం మరో ముందడుగు వేసింది. ఈసారి పిల్లల కోసం ఆహా ప్రత్యేకంగా యానిమేటెడ్ చిత్రాలను తీసుకురాబోతుంది.

ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్, షోస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా.. ఈసారి కార్టూన్ సిరీస్‏లను విడుదల చేయబోతుంది. ఇందులో భాగంగా పిల్లల కోసం కొత్తగా.. మహా గణేశ అనే కార్టూన్ వెబ్ సిరీస్‏ను విడుదల చేయబోతుంది ఆహా. పౌరాణిక కథతోపాటు.. వినోదభరితమైన ఈ వెబ్ సిరీస్ దాదాపు ఎనిమిది ఎపిసోడ్స్ ఉండనున్నాయి. గ్రీన్ గోల్డ్ యానిమేషన్ భాగస్వామ్యంతో ఆహా ఈ ఫిల్మ్ రూపొందించింది. ఈ వెబ్ సిరీస్ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రత్యేక కవితలు, పిల్లలను ఆకర్షించడానికి పాటలు ఇందులో ఉంటాయి.ఇక ఈ సిరీస్‏లో బాల్యం నుంచి గణేష్ ప్రతి ఒక్కరికి శక్తివంతమైన సూపర్ హీరో అని ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ చెప్పారు. ఈ వెబ్ సిరీస్‏కు సంబంధించిన పోస్టర్‏ను విడుదల చేసారు. ఇటీవల అమలాపాల్ నటించిన టైమ్ లూప్ థ్రిల్లర్ కుడి ఏడమైతే సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ట్వీట్..

Also Read: Drugs Case: అవును.. రాగిణి, సంజనాలు డ్రగ్స్‌ తీసుకున్నారు.. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులో సంచలన విషయాలు.

Sithara Cute Photos: ఇన్‌స్టాలో సితార ఘట్టమనేని క్రేజ్ మామూలుగా లేదుగా.. లేటెస్ట్ క్యూట్ పిక్స్..

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు నెక్ట్స్ వన్ ఇయర్ పండగే పండగ.. కారణం ఏంటంటే?