AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే.. ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం పక్కా అంటున్నారుగా..

కరోనా పుణ్యమా అని ఓటీటీలకు విపరీతంగా క్రేజ్ పెరిగింది. థియేటర్స్‌కు తాళాలు పడటంతో సినీప్రేమికులంతా ఓటీటీ వైపే చూశారు..

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే.. ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం పక్కా అంటున్నారుగా..
Ott
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 24, 2021 | 7:06 AM

Share

OTT Platforms: కరోనా పుణ్యమా అని ఓటీటీలకు విపరీతంగా క్రేజ్ పెరిగింది. థియేటర్స్‌కు తాళాలు పడటంతో సినీప్రేమికులంతా ఓటీటీ వైపే చూశారు. దాంతో మేకర్స్ కూడా తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇటీవలే థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో చిన్న సినిమాలు ఒక్కొక్కటిగా థియేట్సర్ వైపు అడుగులు వేస్తున్నాయి. అయితే థియేటర్స్‌లో విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ వచ్చినా నెగిటివ్ టాక్ వచ్చినా  కొన్ని నెలల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు అలా మరికొన్ని సినిమాలు ఓటీటీ వేదికగా అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. అవేంటంటే..

టాలెంటెడ్ హీరో సత్య దేవ్ ఇటీవల తిమ్మరుసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. తిమ్మరుసుకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ జనాలు థియేటర్స్‌కు రావడానికి కాస్త ఆలోచిస్తున్నారు. దాంతో ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ నెల 28నుంచి సత్యదేవ్ తిమ్మరుసు సినిమా స్ట్రీమింగ్ కానుంది.

అలాగే కుర్ర హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కల్యాణమండపం సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొదటి కమర్షియల్ హిట్ అంటూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అందుకే ఎస్ఆర్ కళ్యాణ మండపం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తెలుగు ఓటీటీ సంస్థ ఆహ ఈ సినిమాను దక్కించుకుంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం త్వరలో ఆహాలో రిలీజ్ కాబోతుందని అధికార ప్రకటన కూడా వచ్చేసింది. ఈనెల 28న కళ్యాణ మండపంను మన ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఆహా ప్రకటించింది. ఇలా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి మరోసారి రాబోతున్నాయి. భారీ అంచనాలున్న ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో పాటు తిమ్మరుసు సినిమాను కూడా ఓటీటీలో చూసి  ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Niharika Konidela: బిగ్ బేబీ బ్రదర్‌తో రాఖీ సెలబ్రేషన్స్ .. ఈ ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టండి అంటున్న నిహారిక

Kangana Ranaut Thalaivi: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తలైవి మూవీ విడుదలకు డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?