Nithiin’s Maestro: ఆసక్తిని రేకెత్తిస్తున్న మాస్ట్రో ట్రైలర్.. పోటాపోటీగా నటించిన నితిన్-తమన్నా..
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అందాదూన్ సినిమాను ఇప్పుడు తెలుగులో మ్యాస్ట్రోగా..
Nithiin’s Maestro: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అందాదూన్ సినిమాను ఇప్పుడు తెలుగులో మ్యాస్ట్రోగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఇటీవల వరుసగా రెండు సినిమాల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్. ఇప్పుడు ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన చెక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత వచ్చిన రంగ్ దే సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటించింది. దాంతో ఇప్పుడు మాస్ట్రో సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు నితిన్ . మేర్లపాక గాంధీ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నాభానటేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజా సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ ట్రైలర్ చూస్తుంటే నితిన్ – తమన్నా పోటీ పడి మరీ నటించినట్లుగా అనిపిస్తుంది. నితిన్- నభా నటేష్‌ల మద్య లవ్ కమ్ రొమాన్స్ కూడా ఆకట్టుకుంది. ట్రైలర్‌లో నితిన్ నిజంగా అంధుడేనా లేక నటిస్తున్నాడా అన్న అనుమానం కలిగేలా చూపించారు. సినిమా అంతా ఓ మర్డర్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. అలాగే కళ్ళు కనపడకపోతే ఉండే ఇబ్బందులు అందరికి తెలుసు…కానీ అందులో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఇక ట్రైలర్‌లో తమన్నా చెప్పిన డైలాగులు, ఆమెలోని నెగిటివ్ షేడ్స్ ఆసక్తిని కలిగించాయి. సినిమాల్లో మర్డర్ చూడ్డానికే భయపడే నేను.. నిజంగా మర్డర్ చేయాల్సి వచ్చింది అంటూ తమన్నా చెప్పిన డైలాగ్ సినిమా పై అంచనాలు పెంచింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :