RGV VS Mega Fans: మరోసారి మెగా ఫ్యాన్స్‌తో పెట్టుకున్న ఆర్జీవీ.. చిరు బర్త్‌డే సెలబ్రెషన్స్‌కు బన్నీ అందుకే రాలేరంటూ..

RGV Mega Family: సంచలనం ఎక్కడ ఉంటే అక్కడ రామ్‌గోపాల్‌ వర్మ అక్కడ ఉంటాడు అనడం కంటే.. వర్మ ఎక్కడ ఉంటే అక్కడ సంచలనం ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదేమో...

RGV VS Mega Fans: మరోసారి మెగా ఫ్యాన్స్‌తో పెట్టుకున్న ఆర్జీవీ.. చిరు బర్త్‌డే సెలబ్రెషన్స్‌కు బన్నీ అందుకే రాలేరంటూ..
Rgv
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 24, 2021 | 7:30 PM

RGV  VS  Mega Family: సంచలనం ఎక్కడ ఉంటే అక్కడ రామ్‌గోపాల్‌ వర్మ అక్కడ ఉంటాడు అనడం కంటే.. వర్మ ఎక్కడ ఉంటే అక్కడ సంచలనం ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదేమో. సందర్భం ఏదైనా, పరిణామాలు ఏవైనా అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటాడు వర్మ. ఎప్పటికప్పుడు సెన్సేషనల్‌ కామెంట్స్‌, ట్వీట్స్‌ చేస్తూ అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటాడీ సంచనల దర్శకుడు. రామ్‌గోపాల్‌ వర్మ తన సినిమాల కంటే ఎక్కువగా ట్వీట్ల ద్వారానే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతుంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలుసార్లు మెగా ఫ్యామిలీపై పలుసార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ తాజాగా మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేశారు.

తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించకొని చిరు ఇంట్లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు హాజరయ్యారు. అయితే పలు కారణాలతో అల్లు అర్జున్‌ ఈ వేడుకకు హాజరుకాలేదు. దీనినే టార్గెట్‌ చేసుకున్న వర్మ ట్విట్టర్‌ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వర్మ ట్వీట్ చేస్తూ.. ‘చిరంజీవి పుట్టిన రోజుకు వేడుకకు వచ్చినవారంతా ఆయన సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్‌ ఒక్కడే అసలైన మెగాస్టార్‌’ అంటూ ట్వీట్ చేశారు. అంతటితో ఆగని వర్మ.. ‘అల్లు రామలింగయ్య వారసులందరిలో నిజమైన సక్సెస్‌ ఒక్క అల్లు అర్జున్‌దే’ అంటూ తనదైన శైలిలో స్పందించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ వర్మపై మరోసారి గుర్రుమంటున్నారు. మరి వర్మ చేసిన ఈ ట్వీట్‌ మరెన్ని సంచనాలకు తెర తీస్తుందో చూడాలి.

వర్మ చేసిన వరుస ట్వీట్లు..

Also Read: Drugs Case: అవును.. రాగిణి, సంజనాలు డ్రగ్స్‌ తీసుకున్నారు.. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులో సంచలన విషయాలు.

Sithara Cute Photos: ఇన్‌స్టాలో సితార ఘట్టమనేని క్రేజ్ మామూలుగా లేదుగా.. లేటెస్ట్ క్యూట్ పిక్స్..

Pranavi Manukonda: ఇన్‌స్టాలో ప్రణవి మానుకొండ క్రేజ్.. ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పిన స్మాల్ స్క్రీన్ బ్యూటీ