Pranavi Manukonda: ఇన్‌స్టాలో ప్రణవి మానుకొండ క్రేజ్.. ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పిన స్మాల్ స్క్రీన్ బ్యూటీ

Pranavi Manukonda: ఓ వైపు తెలుగు సీరియల్ నటిగా.. మరోవైపు టిక్ టాక్ స్టార్‌గా మంచి గుర్తింపు సాధించింది ప్రణవి మానుకొండ. దేశంలో టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన తర్వాత కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Pranavi Manukonda: ఇన్‌స్టాలో ప్రణవి మానుకొండ క్రేజ్.. ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పిన స్మాల్ స్క్రీన్ బ్యూటీ
Pranavi Manukonda
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 24, 2021 | 11:14 AM

Pranavi Manukonda: ఓ వైపు తెలుగు సీరియల్ నటిగా.. మరోవైపు టిక్ టాక్ స్టార్‌గా మంచి గుర్తింపు సాధించింది ప్రణవి మానుకొండ. దేశంలో టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన తర్వాత కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరీముఖ్యంగా ఇంట్రెస్టింగ్ పోస్టింగ్స్ పెడుతూ ఇన్‌స్టాగ్రమ్‌లో తన ఫాలోవర్స్ సంఖ్యను భారీగా పెంచుకుంది. ఇన్‌స్టాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 10 లక్షలు దాటిందంటే ఆమెకున్న క్రేజ్ ఏపాటిదో అర్ధంచేసుకోవచ్చు. 1 మిల్లియన్ మైలురాయిని చేరుకోవడం పట్ల ప్రణవి మానుకొండ సంతోషం వ్యక్తంచేశారు. తన సంతోషాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఇన్‌స్టాలో ఓ పోస్టింగ్ చేశారు. మొదటి నుంచీ తనను చాలా మంది నెటిజన్స్ సపోర్ట్ చేస్తున్నారని..వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సీరియల్స్‌లో తన కెరీర్ మొదలు పెట్టిన ప్రణవి మానుకొండ.. ఇప్పుడు వరుస సీరియల్స్‌తో బిజీబిజీగా ఉన్నారు. తెలుగు సీరియల్స్‌లో మంచి పాపురాలిటీ పొందారు. గంగ మంగ సీరియల్ ప్రణవిని ప్రతి ఇంటికి పరిచయం చేసింది. టీవీ హోస్ట్‌గానూ కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించి గుర్తింపు సాధించారు.

Also Read..

షూటింగ్‌లో గాయపడిన అభిషేక్ బచ్చన్.. ఆలస్యంగా వెలుగులోకి.. ఆందోళనలో ఫ్యాన్స్

పిల్లల తల్లైనా స్టార్ హీరోయిన్‌గా ఖ్యాతిగాంచిన అలనాటి మేటి నటి అంజలీదేవి జయంతి నేడు