AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: మీరు ఐటీఆర్‌ దాఖలు చేస్తున్నారా..? ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి.. లేకపోతే నష్టమే..!

Income Tax: అదాయపు పన్ను రిటర్న్‌ ఐటీఆర్‌ దాఖలు చేయడం అనేది ఒక పెద్ద పని. ఇందు కోసం అనేక రకాల పత్రాలు అవసరమై..

Income Tax: మీరు ఐటీఆర్‌ దాఖలు చేస్తున్నారా..? ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి.. లేకపోతే నష్టమే..!
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 25, 2021 | 7:59 PM

Share

Income Tax: అదాయపు పన్ను రిటర్న్‌ ఐటీఆర్‌ దాఖలు చేయడం అనేది ఒక పెద్ద పని. ఇందు కోసం అనేక రకాల పత్రాలు అవసరమై ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది ఆదాయానికి సంబంధించి పత్రాలు. మీరు ఒక సంవత్సరంలో ఎక్కడ పెట్టుబడి పెట్టారో మీరు అందించే పత్రంలో తెలిసిపోతుంది. రిటర్న్‌ దాఖలు చేయడంలో మీరు ఏదైనా పత్రాలు అందించనట్లయితే అధిక మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శాఖ మీకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అందుకే మీకు నోటిసులు వచ్చినప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇందుకు సమయం కూడా వృధా పోవడమే కాకుండా అధిక మొత్తంలో డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. వినియోగదారులకు ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా భారత ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్‌ దాఖలు చేయడానికి సమయం ఇచ్చింది. ఈ సమయంలోగా అన్ని పత్రాలు పూర్తి చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం సుమారు నాలుగు నెలల సమయం ఇచ్చింది. దీంతో  సరైన పత్రాలు సమర్పించేందుకు జాగ్రత్తలు పడవచ్చు.  ఒక వేళ మీరు ఐటీఆర్‌ దాఖలు చేయబోతున్నట్లు మీ డబ్బులు వృధా కాకుండా ఈ డాక్యుమెంట్లు సమర్పించుకోండి.

పాన్‌, ఆధార్‌ కార్డు:

ఐటీఆర్‌ దాఖలు చేయడానికి మొదట ముఖ్యమైన డాక్యుమెంట్‌ పాన్‌ కార్డు. పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడంలో పాన్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇక రెండో డాక్యుమెంట్‌ ఆధార్‌ కార్డు. ఆదాయపు పన్ను సెక్షన్‌ 139AA ప్రకారం.. ఆదాయపు పన్ను రిటర్న్‌ విజయవంతంగా దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులు పాన్‌, ఆధార్‌ను అందించడం ఎంతో ముఖ్యం. పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి ముందు ఆధార్‌, పాన్‌ లింక్‌ చేయడం కూడా ఎంతో అవసరం.

ఫారం -16:

మీరు కంపెనీలో ఉద్యోగి అయితే జీతాన్ని ఆదాయంగా తీసుకుంటే ఐటీఆర్‌ దాఖలు చేయడానికి ఫారం-16 ఫారం అవసరం. ఈ ఫారాన్ని కంపెనీ జారీ చేస్తుంది. ఇది ఒక నిర్ధిష్ట సంవత్సరంలో కంపెనీ నుంచి తీసుకున్న ఆదాయాన్ని సూచిస్తుంది. దీనిపై కంపెనీ తరపున టీడీఎస్‌ తీసివేయబడుతుంది. ఫారం-16 పార్ట్‌A, పార్ట్‌-Bని కలిగి ఉంటుంది. పార్ట్‌Aలో కంపెనీ తీసివేసే అంశం గురించి ఉంటుంది. పార్ట్‌-Bలో ఉద్యోగి స్థూల జీతం ఆదాయం ఉంటుంది.

వేతన స్లిప్‌:

ఇంటి అద్దె అలవెన్ష్‌, లీవ్‌ ట్రావెల్స్‌ ఎల్‌టీఏ, మెడికల్‌ అలవెన్స్‌, పర్సనల్‌ అలవెన్స్‌ మొదలైన రిటర్న్‌ దాఖలు చేయడానికి వేతన స్లిప్‌ అవసరం.

టీడీఎస్‌ సర్టిఫికేట్‌:

మీరు జీతం కాకుండా ఇతర వాటి నుంచి సంపాదిస్తున్నట్లయితే దాని మీద టీడీఎస్‌ తీసివేయబడుతుంది. దీని సర్టిఫికేట్‌ కూడా సమర్పించాల్సి ఉంటుంది. వేతనం కాకుండా ఇతర ఆదాయాలపై వచ్చే వడ్డీపై టీడీపీ తీసివేయబడుతుంది. ఈ సర్టిఫికేట్‌ ఫారం-16 రూపంలో ఉంటుంది.

ఫారం-26AS:

మీరు సెక్షన్‌ 80సీ, 80సీసీడీ (1), 80సీసీసీ ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందితే అప్పుడు ఈ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది.

పెట్టుబడికు సంబంధించిన పత్రాలు:

మీరు సెక్షన్‌ 80సీ, 80 సీసీడీ (1), 80సీసీసీ వంటివి ఆదాయపు పన్ను కింద మినహాయింపు ప్రయోజనం పొందితే అప్పుడు ఈ వివరాలు అందించాల్సి ఉంటుంది. దీని కోసం రిటర్న్‌ దాఖలు చేసేటప్పుడు పెట్టుబడులకు సంబంధించి వివరాలు నమోదు చేయాలి. బీమా పాలసీ ప్రీమియం, ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడి, ఈపీఎఫ్‌లో పెట్టుబడి, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌లో పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.

గృహ రుణాలకు సంబంధించి..

మీరు ప్రతి నెల గృహ రుణాలపై ఈఎంఐ చెల్లిస్తుంటే స్టేట్‌ మెంట్‌ను పన్ను రిటర్న్‌ ఫైల్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. ఈ స్టేట్‌మెంట్‌లో రుణం అసలు, వడ్డీకి సంబంధించిన పూర్తి వివరాలు పేర్కొనాలి. ఆదాయపు పన్ను సెక్షన్‌ 24 ప్రకారం రుణదాత గృహ రుణం వడ్డీపై రూ.2 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఐటీఆర్‌ దాఖలు చేసేటప్పుడు గృహ రుణానికి సంబంధించిన వివరాలు సమర్పించడం వల్ల భారీగా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

LIC Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.40 పొదుపుతో.. ఏటా రూ.40 వేలు పొందవచ్చు..!

LIC Policy: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. రద్దయిన పాలసీలను పునరుద్దరించేందుకు ఆలస్య రుసుములో మినహాయింపు!

మీరు 50 వేల రూపాయలకంటే ఎక్కువ మొత్తానికి చెక్ ఇస్తున్నారా? అయితే..ఈ నిబంధనలు పాటించాల్సిందే!

జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఈ 4 ఆహారాలను తరచుగా తినండి..