JIO Offers: ఆకర్షణీయమైన రీచార్జ్‌ ప్లాన్స్‌ను ప్రకటించిన జియో.. ఇదే బాటలో ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌.

JIO Offers: టెలికం కంపెనీల మధ్య రోజురోజుకీ పెరుగుతోన్న పోటీ వినియోగదారులకు లాభంగా మారుతోంది. వినియోగదారులను ఆకర్షించే క్రమంలో పోటాపోటీగా..

JIO Offers: ఆకర్షణీయమైన రీచార్జ్‌ ప్లాన్స్‌ను ప్రకటించిన జియో.. ఇదే బాటలో ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌.
Recharge Offers
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 24, 2021 | 5:45 PM

JIO Offers: టెలికం కంపెనీల మధ్య రోజురోజుకీ పెరుగుతోన్న పోటీ వినియోగదారులకు లాభంగా మారుతోంది. వినియోగదారులను ఆకర్షించే క్రమంలో పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ‘నో డేలీ లిమిట్‌’తో ఫ్రీడమ్‌ ప్రీపెడ్‌ ప్లాన్స్‌ను ప్రకటించాయి. ఈ ప్లాన్స్‌ రూ. 127తో మొదలై రూ. 2397 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్స్‌తో రీచార్జ్‌ చేసుకున్న వారికి జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్‌ వంటి యాప్‌లను ఉచితంగా అందిస్తోంది జియో.

జియో అందిస్తోన్న ఆఫర్లలో ప్రధానమైంది రూ. 447 ఫ్రీడమ్‌ ప్రీపెడ్‌ ప్లాన్‌. ఈ రీచార్జ్‌ చేసుకున్న వారికి 60 రోజుల వ్యాలిడిటీకి 50 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, జియో యాప్స్‌ను ఉచితంగా యాక్సెస్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక రూ. 444 రీచార్జ్‌ చేసుకున్న వారికి రోజూ 2 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందిస్తారు.

బీఎస్‌ఎన్‌ ఆఫర్లు..

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఆకర్షీయణీమైన ఆఫర్లను ప్రకటించింది. రూ. 447తో రీచార్జ్‌ చేసుకుంటే 60 రోజుల వ్యాలిడిటీతో 100 జీబీ డేటాను అందిస్తారు. ఈ డేటా పరిమితి దాటిన తర్వాత ఇంటర్నెట్‌ స్పీడ్‌ 80 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఇక అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా అందిస్తారు. వీటితో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌, ఈరోస్‌ నౌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సేవలను ఉచితంగా పొందొచ్చు.

ఎయిర్‌ టెల్‌ కూడా..

ఎయిర్‌ టెల్‌ కూడా వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది. ఇందులో భాగంగానే కొత్తగా రూ. 448 రీచార్జ్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీంతో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3 జీబీ డేటాను పొందొచ్చు. అలాగే ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా పొందొచ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం, ప్రైమ్‌ వీడియో (మొబైల్‌ ఎడిషన్‌), వింక్‌ మ్యూజిక్‌, షా అకాడమీని కూడా యాక్సెస్‌ పొందొచ్చు.

Also Read: Maha Ganesha: ఆహా మరో ముందడుగు.. పిల్లల కోసం ప్రత్యేకంగా మహా గణేశ.. వినోదంలో మరింత జోష్..

న్యూజిలాండ్ లో ఒక్క రోజులో పెరిగిన కోవిడ్-19 కేసులు..గత ఏడాది ఏప్రిల్ తరువాత తొలిసారిగా..

RGV VS Mega Family: మెగా ఫ్యాన్స్‌ను మరోసారి రెచ్చగొట్టిన ఆర్జీవీ.. ఓవైపు అల్లు అర్జున్‌ను పొగుడుతూనే.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్