న్యూజిలాండ్ లో ఒక్క రోజులో పెరిగిన కోవిడ్-19 కేసులు..గత ఏడాది ఏప్రిల్ తరువాత తొలిసారిగా..
న్యూజిలాండ్ లో కోవిడ్-19 కేసులు పెరిగాయి. మంగళవారం ఒక్కరోజులోనే (గత 24 గంటల్లో) 41 కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ తరువాత మొదటిసారిగా ఇన్ని కేసులు వెలుగులోకి వచ్చాయన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య....
న్యూజిలాండ్ లో కోవిడ్-19 కేసులు పెరిగాయి. మంగళవారం ఒక్కరోజులోనే (గత 24 గంటల్లో) 41 కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ తరువాత మొదటిసారిగా ఇన్ని కేసులు వెలుగులోకి వచ్చాయన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 148 కి పెరిగినట్టు వారు చెప్పారు. ముఖ్యంగా ఆక్లాండ్ లో ఎక్కువగా..38 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఈ నగరంలో కేవలం ఒకే ఒక్క డెల్టా వేరియంట్ కేసు నమోదు కాగా-ప్రధాని జసిండా ఆర్డర్న్స్ మూడు రోజుల లాక్ డౌన్ విధించారు. కానీ ఏ కారణం వల్లో ఈ కేసులు క్రమంగా ఇతర నగరాలకు వ్యాపించాయి, వెల్లింగ్టన్ లో మూడు కేసులు నమోదయ్యాయి. ఇవి ఇతర ప్రాంతాలకు వ్యాపించే సూచనలు ఉన్నాయని, అయితే ప్రజలు ఆందోళన చెందవలసిన పని లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకున్నదని ఈ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రధాని జసిండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్టు ఆయన చెప్పారు. దేశంలో సుమారు 50 లక్షల జనాభా ఉండగా దాదాపు 3 వేల కేసులు వెలుగు చూశాయి.
28 మంది రోగులు మృతి చెందారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని ప్రధాని జసిండా ఈ నెల 27 వరకు పొడిగించారు. అయితే ఆక్లాండ్ లో మాత్రం ఆంక్షలు ఈ నెల 31 వరకు అమలులో ఉంటాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పెంచామని, వచ్చేనెల 1 కల్లా అన్ని వయస్సులవారూ వ్యాక్సిన్ స్లాట్స్ బుక్ చేసుకోవాలని ఆర్ధిక మంత్రి గ్రాంట్ రాబర్ట్ సన్ కోరారు. ఇప్పటివరకు దేశంలో 2.55 మిలియన్ల మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: అమెరికాలో పెళ్లి.. ఇండియాలో విందు! ఆన్‌లైన్ పెళ్లి సందడి!వైరల్ అవుతున్న వీడియో..:NRI Marriage Viral Video.
300 మంది తాలిబన్ల హతం..! పంజ్‌షీర్ లోయపై తాలిబన్లు కన్ను..:Afghanistan Crisis Live Video.