Afghan – India: తాలిబాన్ల రాకతో అఫ్గనిస్థాన్‌లో భారత్‌కు చిక్కులు తప్పవా? ఇప్పుడు మనముందున్న ఆప్షన్స్ ఇవేనా?

Afghanistan - Taliban Crisis: తాలిబాన్లతో సంబంధాలపై ఈ నెల 26న కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ అఖిలపక్ష సమావేశానికి ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం అందలేదు.

Afghan - India: తాలిబాన్ల రాకతో అఫ్గనిస్థాన్‌లో భారత్‌కు చిక్కులు తప్పవా? ఇప్పుడు మనముందున్న ఆప్షన్స్ ఇవేనా?
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 24, 2021 | 3:54 PM

Afghanistan – Taliban Crisis: తాలిబాన్లతో సంబంధాలపై ఈ నెల 26న కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ అఖిలపక్ష సమావేశానికి ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం అందలేదు. కీలకమైన ఆఫ్గన్ వ్యవహారంపై జరిగే అఖిలపక్ష భేటీకి  తనను కూడా పిలవాలని అసద్ ఇప్పటికే డిమాండ్ చేశారు. ఆఫ్గన్‌లో తాలిబన్ల అధికారాన్ని గుర్తించాలా వద్దా అనే అంశం ఈ భేటీలో ప్రధాన చర్చ జరగనుంది. మరో పక్క తాలిబాన్లకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్‌, చైనా,రష్యా తీరుపైనా ఈ సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశముంది. అటు తమ పట్ల భారత్‌ వైఖరి మార్చుకోవాలని తాలిబన్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది.

ఇంతకీ తాలిబాన్లతో భారత్‌కున్న ఇబ్బందులు ఏమిటి?

1.తాలిబాన్ల సిద్దాంతంలో ఇప్పటికీ కానరాని మార్పు 2.షరియా చట్టం అమలు, మహిళలపట్ల ఆగని దాడులు 3. తాలిబాన్ల తీవ్రవాదంపై ప్రపంచ వ్యాప్తంగా భయం భయం 4.తాలిబన్ల పై పోరాడిన నాటో, అమెరికా కూటమికి సహకరించిన భారత్ 5. మొదటి నుంచీ భారత్ ను తమ శత్రుదేశంగా భావిస్తున్న తాలిబన్లు 6. తాలిబన్లు భారత్ మధ్య సరిగా లేని సంబంధాలు 7. ఆప్ఘాన్ లోని భారత రాయబార కార్యాలయం పై ఇప్పటికే దాడి చేసిన తాలిబన్లు 8. కీలక పత్రాల కోసం వెతుకులాట, ఆఫీస్ ధ్వంసం, కార్లు స్వాధీనం 9. తాలిబన్లకు సహకరిస్తున్న పాక్, చైనా, రష్యాలు 10. భారత్ ఆప్ఘాన్ మధ్య ఆగిన వాణిజ్యం, నిలిచిన ఎగుమతులు, దిగుమతులు 11. ఇరుదేశాల మధ్య సరిహద్దులు మూసివేత, భారతీయులకు అడ్డంకులు 12. తాలిబన్ల అండతో లష్కరే తోయిబా, లష్కరే తోయిబా వంటి గ్రూపులు రెచ్చిపోయే అవకాశం 13. కశ్మీర్ విషయంలో తాలిబన్లు వారికి సహకరించే అవకాశం 14. కాశ్మీర్‌లో ముజాహిద్దీన్‌లకు తీవ్రవాదుల సహకారం పెరిగే అవకాశం 15. భారత్ తీసుకునే నిర్ణయాలు దక్షిణాసియా పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం

భారత్ ఏం చేయాలంటే…? గతంలో తగిలిన గాయాలను మరిచి తాలిబాన్లతో చర్చలకు సిద్ధం కావడమే మంచిదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానపరమైన నిర్ణయంతో అఫ్గాన్‌తో వాణిజ్యాన్ని కొనసాగించేందుకు వీలుంటుంది. అటు దేశ భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. అప్ఘాన్ తో సాంస్కృతిక సంబంధాలు, అభివృద్ధి విషయాల్లో ముందుకు వెళ్లాలి. అటు భారత్‌లో విద్య, ఉద్యోగాలు, వైద్యం కోసం వస్తున్న అప్ఘన్‌ వాసులకు సాయం చేయాలి. ఆఫ్గనిస్తాన్‌ వ్యవహారాల్లో గతం నుంచి జోక్యం చేసుకుంటున్న పాక్ కట్టడికి భారత్ చర్యలు తీసుకోవాల్సి ఉంది. తాలిబన్లతో సంబంధాలు కొనసాగిస్తున్న రష్యా, ఇరాన్‌ వంటి దేశాలతో భారత్ దౌత్యపరమైన చర్చలు జరపాల్సిన అవసరముంది. అలాగే ఆఫ్గన్‌లో ఇంకా ఉన్న భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరముంది.

ఏం జరుగుతోంది…? అప్ఘనిస్తాన్‌పై ఆధిపత్యం కోసం అమెరికా కూటమి ఆరాటపడుతోంది. ఈ విషయంలో అమెరికా కూటమికి రష్యా – చైనా – పాకిస్తాన్‌ కూటమికి మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ పోరాటల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పడే అవకాశముంది. తాలిబాన్లపై పోరాటానికి పశ్చిమ దేశాలు ఒక్కటి కావాలని బ్రిటన్ పిలుపునిస్తోంది.

Also Read..

ముఖ్యమంత్రిపై సీరియస్ కామెంట్స్.. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్..

జగన్ సర్కార్ డెసిషన్.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ..