Ukraine Plane Hijacked: అఫ్గానిస్తాన్‌లో ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌.. ధృవీకరించిన విదేశాంగ శాఖ..!

Ukraine Plane Hijacked: అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. తాలిబ‌న్ల ఆక్రమ‌ణ‌ల‌తో అక్కడ వాతావరణం పూర్తిగా..

Ukraine Plane Hijacked: అఫ్గానిస్తాన్‌లో ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌.. ధృవీకరించిన విదేశాంగ శాఖ..!
Follow us

|

Updated on: Aug 24, 2021 | 3:40 PM

Ukraine Plane Hijacked: అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. తాలిబ‌న్ల ఆక్రమ‌ణ‌ల‌తో అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. మళ్లీ 1996 నాటి పరిస్థితులు వస్తాయని భయాందోళన చెందుతున్నారు. ఇక తాజాగా ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌కు గురైంది. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో మంగళవారం ఉక్రెయిన్‌ ప్రభుత్వం అఫ్గానిస్తాన్‌లో ఉన్న తమ పౌరులను తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈ క్రమంలో హైజాకర్లు ఉక్రెయిన్ విమానాన్ని హైజాక్‌ చేసి ఇరాన్‌కు మళ్లించారు. విమానం హైజాక్‌ విషయాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. విమానాన్ని హైజాక్‌ చేసింది ఎవరు అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. దానిపై విచారణ చేపడుతున్నామని ఆయన అన్నారు. విమనాంలో ఎంత మంది ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది.

అయితే అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. కాబూల్ వీథుల్లో హల్చల్ చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ దగ్గర కనిపిస్తే చాలు.. కిడ్నాప్ చేస్తుండటంతో పాటు.. వారిపై దాడులకు తెగబడుతున్నారు. శాంతి మంత్రం జపిస్తూనే కాల్పులకు తెగబడుతున్నారు. మ‌హిళ‌ల‌పై విరుచుకుపడుతున్నారు. ఎలాగైనా తప్పించుకొని దేశం దాటిపోవాలని చూస్తున్నవారిపై కఠినంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుంది. అయితే తాజాగా కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్ కావడం సంచలనంగా మారింది.

విదేశాంగ మంత్రి ఏమన్నారంటే..

ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్జెనీ యెనిన్ మాట్లాడుతూ గత ఆదివారం మా విమానం దేశ ప్రజల తరలింపు కోసం అఫ్గానిస్తాన్‌కు చేరింది. ఆ తర్వాత మా విమానాన్ని హైజాక్‌ చేశారు. అందులో ఉన్న ప్రయాణికులు కూడా ఉక్రెయిన్‌ దేశస్థులు కాదు. మా పౌరులకు బదులుగా వేరే ప్రయాణికులను తీసుకుని వెళ్లిపోయారు. దీని వల్ల అఫ్గాన్‌ నుంచి మా దేశస్థుల తరలింపు ప్రక్రియకు ఆటంకం కలిగింది అని యెనిన్‌ తెలిపినట్లు రష్యా న్యూస్‌ ఏజెన్సీ టాస్‌ కథనం వెల్లడించింది. హైజాకర్ల వద్ద ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

విమానం హైజాక్‌ను ఖండించిన ఇరాన్ 

ఉక్రెయిన్‌ విమానం హైజాక్ అయ్యిందని ఉక్రెయిన్‌ వాదనను ఇరాన్ విమానయాన నియంత్రణ సంస్థ ఖండించింది. విమానం ఇంధనం నింపుకోవడానికి రాత్రి సమయంలో మషాద్‌ వద్ద ఆగి ఉక్రెయిన్‌ వెళ్లిందని తెలిపింది. ఇప్పుడు ఈ విమానం కీవ్‌లో ల్యాండ్‌ అయినట్లు చెబుతోంది. ఏది ఏమైనా ఈ విమానం హైజాక్‌ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ కూడా చదవండి:

Afghanistan: పంజ్‌షీర్ లోయకు వందలాది మంది తరలుతున్న తాలిబన్లు.. ట్విటర్‌లో14 సెకండ్ల వీడియో

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్ శరణార్థుల పట్ల ఒక్కో దేశం ఒక్కో వైఖరి.. వారిని అనుమతిస్తున్న దేశాలు ఇవే..