Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్ శరణార్థుల పట్ల ఒక్కో దేశం ఒక్కో వైఖరి.. వారిని అనుమతిస్తున్న దేశాలు ఇవే..

Afghan Taliban Crisis: ఆఫ్గానిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల అరాచక రాజ్యం కొలువుదీరుతున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు విదేశాలకు పారిపోతున్నారు. ఆగస్టు 15న తాలిబన్లు కాబుల్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో..

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్ శరణార్థుల పట్ల ఒక్కో దేశం ఒక్కో వైఖరి.. వారిని అనుమతిస్తున్న దేశాలు ఇవే..
Afghan Crisis
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 23, 2021 | 5:03 PM

ఆఫ్గానిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల అరాచక రాజ్యం కొలువుదీరుతున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు విదేశాలకు పారిపోతున్నారు. ఆగస్టు 15న తాలిబన్లు కాబుల్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఆ రోజు నుంచే ప్రజలు భారీ సంఖ్యలో కాబుల్ విమానాశ్రయానికి చేరుకుని విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విమానం రెక్కల మీద కూర్చొని తప్పించుకునేందుకు ప్రయత్నించిన కొందరు యువకుల ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి.

ఇక ఆఫ్గానిస్థాన్ ప్రజలను శరణార్థులుగా అంగీకరించేందుకు ఒక్కో దేశం ఒక్కో విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఆఫ్గాన్లను శరణార్థులుగా అంగీకరించే విషయంలో తమ దేశ విధానాలను ఇప్పటికే పలు దేశాలు ప్రకటించాయి. 2020 నాటి వరకు ప్రపంచంలో ఆఫ్గానిస్థాన్‌కు చెందిన 28 లక్షల మంది శరణార్ధులు విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా సిరియాకు చెందిన 68 లక్షల మంది శరణార్థులు విదేశాల్లో తలదాల్చుకుంటున్నారు. వీరిలో అత్యధికంగా 40 లక్షల మంది శరణార్థులకు టర్కీ ఆశ్రయం కల్పిస్తోంది. వీరిలో అత్యధికరులు సిరియాకు చెందిన వారే ఉన్నారు.

ఇతర దేశాల్లో తలదాల్చుకుంటున్న శరణార్థుల్లో 68 శాతం మంది సిరియా, వెనిజులా, ఆఫ్గనిస్థాన్, సూడాన్, మయన్మార్ చేశాలకు చెందిన వారే ఉన్నారు. హింస, తెగల మధ్య ఘర్షణలు, మానవ హక్కుల ఉల్లంఘటన తదితర కారణాలతో 2020 నాటి వరకు ప్రపంచంలో 8.24 కోట్ల మంది ప్రజలు ఇతర దేశాల్లో శరణార్థులుగా ఆశ్రయం పొందుతున్నారు.

Afghanistan Crisis

Afghanistan Crisis

ఆఫ్గనిస్థాన్ శరణార్థుల విషయంలో ఏయే దేశం ఎలాంటి విధానాన్ని అవలంభిస్తున్నాయో తెలుసా?

1. అమెరికా…శరణార్థులకు ఆశ్రయం. విమానాల ద్వారా పెద్ద మొత్తంలో తరలింపు. 2. ఇంగ్లాండ్ – 20,000 ఆఫ్ఘన్ శరణార్థులకు దీర్ఘకాలిక ఆశ్రయం. మహిళలు, పిల్లలకు ఈ దేశం ప్రాధాన్యత

3) ఆస్ట్రేలియా – 3,000 ఆఫ్గాన్ శరణార్థులకు ఒక సంవత్సరం పాటు వీసాలు జారీ చేయాలని నిర్ణయం

4) తజికిస్తాన్ – ఈ దేశం 1 మిలియన్ ఆఫ్గాన్ శరణార్థులకు వసతి కల్పించడానికి సిద్ధం

5) కెనడా – 20,000 ఆఫ్గనిస్తాన్ వాసులు ఇప్పటికే దేశం విడిచి ఇక్కడ స్థిరపడ్డారు.

6) జర్మనీ – ప్రమాదంలో ఉన్న 10,000 మంది ఆఫ్ఘన్లకు చోటు ఇవ్వడానికి ఈ దేశం నిర్ణయం

7) భారత్…ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న హిందువులు, సిక్కులను తిరిగి తీసుకువస్తామని ప్రభుత్వం హామీ ఈ -వీసా 6 నెలల పాటు చెల్లుబాటు

8) ఇరాన్: ఆఫ్గాన్-ఇరాన్ సరిహద్దు 3 ప్రావిన్సులలో ఆఫ్గన్ శరణార్థుల కోసం శిబిరాలు ఏర్పాటు

9) పాకిస్థాన్: ఆఫ్ఘన్ తో తన సరిహద్దును మూసేస్తున్నట్లు ప్రకటన. కానీ వారి కోసం తెరిచే ఉన్న సరిహద్దు

10. ఆస్ట్రియా, రష్యా, ఫ్రాన్స్ లు అనుమతి.

11. ఉగ్రవాదులు ఆఫ్ఘన్ శరణార్థులుగా నటించడం తమకు ఇష్టం లేదన్న రష్యా

12. కెనడా, ఇరాన్‌, ఉబ్బెకిస్తాన్‌, నార్త్‌ మాసెడోనియా, ఉగాండా, అల్బేనియా అండ్‌ కొసోవో, టర్కీ దేశాలు అనుమతి.

Also Read..

 డ్రోన్ల వాడకం పౌరుల ప్రాధమిక హక్కులను ఉల్లగించడమే.. వాటిని నిషేధించాలని డిమాండ్ చేస్తున్న ఒవైసీ

Viral Video: పొలంలో 5 అడుగుల భారీ నాగుపాము.. భయంతో పరుగులు పెట్టిన రైతులు..