Asaduddin Owaisi: డ్రోన్ల వాడకం పౌరుల ప్రాధమిక హక్కులను ఉల్లగించడమే.. వాటిని నిషేధించాలని డిమాండ్ చేస్తున్న ఒవైసీ

Asaduddin Owaisi: దేశంలో నేరాలను అరికట్టడానికి.. నిందితులను గుర్తించడానికి డ్రోన్ల వాడకం రేవుజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2021 డ్రోన్ రూల్స్ ని రూపొందించింది. అయితే ఇదే విషయంపై..

Asaduddin Owaisi:  డ్రోన్ల వాడకం పౌరుల ప్రాధమిక హక్కులను ఉల్లగించడమే.. వాటిని నిషేధించాలని డిమాండ్ చేస్తున్న ఒవైసీ
Asaduddin Owaisi
Follow us
Surya Kala

|

Updated on: Aug 23, 2021 | 4:50 PM

Asaduddin Owaisi: దేశంలో నేరాలను అరికట్టడానికి.. నిందితులను గుర్తించడానికి డ్రోన్ల వాడకం రేవుజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2021 డ్రోన్ రూల్స్ ని రూపొందించింది. అయితే ఇదే విషయంపై ఎమ్ఐఎం నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోషల్పో మీడియా వేదికగా స్పందించారు. పోలీసులు నిఘా కోసం డ్రోన్‌ల వాడకాన్ని నిషేధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్‌ చేశారు. పౌరుల కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయడానికి.. పోలీసులు ముఖ చిత్రాన్ని గుర్తించేందుకు సాంకేతికతను పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు.

ప్రభుత్వం, పోలీసులు డ్రోన్ల వాడుతూ.. రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు డ్రోన్‌ల ద్వారా ఒక వ్యక్తి చిత్రాలను తీసేటప్పుడు ముందుగా అనుమతులు పొందాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఉందని గుర్తు చేశారు అసదుద్దీన్ ఒవైసీ.

డ్రోన్‌ల ద్వారా తీసిన చిత్రాలు ఆడియో, వీడియోలు నిర్ధిష్ట సమయం పరిమితి కోసం, అలాగే ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించేలా ఉండాలని సూచించారు. డ్రోన్ల ద్వారా నిఘా పెట్టడం సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘించినట్లవుతుందన్నారు.

Also Read: Hard Toppings: పిజ్జా ఆర్డర్ చేసిన కస్టమర్‌కు షాక్.. టాపింగ్‌లో బయల్పడిన ఇనుపవస్తువులు.. స్పందించిన సంస్థ