Hard Toppings: పిజ్జా ఆర్డర్ చేసిన కస్టమర్‌కు షాక్.. టాపింగ్‌లో బయల్పడిన ఇనుపవస్తువులు.. స్పందించిన సంస్థ

Hard Toppings: ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో ఫేమస్ రెస్టారెంట్ల నుంచి తినే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే.. అది సురక్షితమని సర్వసాధారణంగా వినియోగదారులు భావిస్తారు. అందుకు అనుగుణంగానే తమ ఫుడ్ ను..

Hard Toppings: పిజ్జా ఆర్డర్ చేసిన కస్టమర్‌కు షాక్.. టాపింగ్‌లో బయల్పడిన ఇనుపవస్తువులు.. స్పందించిన సంస్థ
Hard Toppings
Follow us

|

Updated on: Aug 23, 2021 | 4:25 PM

Hard Toppings: ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో ఫేమస్ రెస్టారెంట్ల నుంచి తినే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే.. అది సురక్షితమని సర్వసాధారణంగా వినియోగదారులు భావిస్తారు. అందుకు అనుగుణంగానే తమ ఫుడ్ ను ఆర్డర్ చేస్తారు. అయితే మీరు తినే ఆహారాన్ని ఎంత బ్రాండెడ్ కంపెనీ లో ఆర్డర్ చేసినా తినే సమయంలో వాటిని జాగ్రత్తగా పరిశీలించి తినాల్సి ఉందని ఇప్పటికే పలు సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా ఓ ఫేమస్ రెస్టారెంట్ నుంచి ఫిజ్జా ఆర్డర్ చేస్తే.. ఆ కస్టమర్ కు షాక్ ఇచ్చెనలా ఆ పీజ్జాలో టాపింగ్ లో బోట్లు, నట్లు కనిపించి షాక్ ఇచ్చాయి. వినియోగదారుడి ఫిర్యాదుపై సదరు కంపెనీ స్పందించింది. క్షమాపణ తెలిపింది. వివరాల్లోకి వెళ్తే..

డోమినోస్ టేక్అవే నుంచి ఓ మహిళ జూలై 29 న పిజ్జాను ఆర్డర్ చేసింది. ఆ మహిళ పిజ్జాను తింటూ.. సగంలోకి వచ్చిన తర్వాత ఆ పిజ్జాలో ఇనుప వస్తువులున్నట్లు గుర్తించింది. వెంటనే ఆమె ఇదే విషయంపై స్పందిస్తూ.. ఫ్లీట్‌వుడ్ రోడ్ నార్త్‌లోని అవుట్‌లెట్‌కు ఫోన్ చేసి పిజ్జాలో ఇనుప వస్తువులైన నట్లు, బోట్లు ఉన్నాయని చెప్పింది. తన డబ్బులు తనకు తిరిగి చెల్లించమని రీఫండ్ అడిగింది. విషయం తెలుసుకున్న అవుట్‌లెట్ ఆ కస్టమర్ మహిళకు క్షమాపణ చెప్పింది. పిజ్జా కోసం కస్టమర్ పే చేసిన డబ్బులను తిరిగి చెల్లించింది.

అయితే ఆ అప్పటికే కస్టమర్ పిజ్జా లో ఇనుపవస్తువులున్న ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేసింది. ఎవరైనా ఆహారం తినే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోమని.. జాగ్రత్తగా పరిశీలించి ఆహారం తినమని ఆ ఫోటోలకు కామెంట్ జత చేసింది. దీంతో డొమినోస్ ఫిజ్జా పై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.

ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ మహిళ స్థానిక మీడియా , స్థానిక ఆహార ఏజెన్సీని ట్యాగ్ చేసింది. “దయచేసి తినడానికి ముందు మీ పిజ్జాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.. ముఖ్యంగా ఫ్లీట్‌వుడ్ రోడ్ నార్త్‌లోని థోర్న్‌టన్-క్లీవ్లీస్ బ్రాంచ్‌లో డొమినోస్ నుంచి పిజ్జా ను ఆర్డర్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండని సూచించింది.

ఈ విషయంపై వెంటనే కంపెనీ స్పందించింది. తమ వలన కలిగిన అసౌకర్యానికి కస్టమర్ మహిళకు క్షమాపణలు చెప్పింది, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు తాము స్టోర్‌తో మాట్లాడామని డొమినోస్ సంస్థ తెలిపింది. అంతేకాదు “డొమినోస్‌ సంస్థ కస్టమర్ సంతృప్తి , భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపింది. అయితే ఇటువంటి సంఘంటలు చాలా అరుదుగా జారుతాయని.. ఇక నుంచి ఇటువంటివి జరగకుండా చూస్తామని డొమినోస్ పిజ్జా ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read: Andhra Kesari: లాయర్‌గా లక్షలు ఆర్జించి.. ఆంధ్రరాష్ట్రానికి సీఎంగా చేసినా.. చివరకు తనకంటూ ఏమీ మిగుల్చుకోని ‘ఆంధ్రకేసరి’