‘ఆగస్టు 31 డెడ్ లైన్ దాటారో.. అది మీకు రెడ్ లైనే’.. అమెరికా, బ్రిటన్ దేశాలకు తాలిబన్ల హెచ్చరిక
ఆగస్టు 31 తరువాత కూడా కాబూల్ లో అమెరికా, బ్రిటన్ దేశాల బలగాలు ఉన్న పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఈ దేశాలను తాలిబన్లు హెచ్చరించారు.
!['ఆగస్టు 31 డెడ్ లైన్ దాటారో.. అది మీకు రెడ్ లైనే'.. అమెరికా, బ్రిటన్ దేశాలకు తాలిబన్ల హెచ్చరిక](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/08/suhail-shaheen.jpg?w=1280)
ఆగస్టు 31 తరువాత కూడా కాబూల్ లో అమెరికా, బ్రిటన్ దేశాల బలగాలు ఉన్న పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఈ దేశాలను తాలిబన్లు హెచ్చరించారు. అది మీకు ‘రెడ్ లైనే’ అవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బలగాల పొడిగింపునకు తాము అనుమతించబోమని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ స్పష్టం చేశారు. ఇక జాప్యం చేయరాదని..డెడ్ లైన్ క్రాస్ చేసిన పక్షంలో జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నాడు. తాలిబన్లు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. అందువల్ల మీరు ఇంకా ఈ దేశాన్ని మీ ‘ఆధీనంలోనే’ ఉంచుకున్న పక్షంలో ప్రతీకార చర్యలకు దిగుతాం అని ఆయన చెప్పాడు. ఈ నెల 31 లోగా మీ సైనికులను పూర్తిగా ఉపసంహరిస్తామని మీరే చెప్పారని ఆయన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ని ఉద్దేశించి అన్నారు. తమకు ఇంకా వ్యవధి కావాలని ఈ రెండు దేశాలు కోరితే దానికి తమ సమాధానం ‘నో’ అన్నదే అని ఆయన వ్యాఖ్యానించాడు. అఫ్గానిస్థాన్ లో తమ దేశస్థుల తరలింపు పూర్తిగా జరగాల్సి ఉందని, అందువల్ల బలగాల ఉపసంహరణను మరికొంత కాలం పొడిగించే అవకాశాలున్నాయని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని బైడెన్ తాజాగా పేర్కొన్నారు.
అటు-బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఈ పొడిగింపు మేలని బైడెన్ ని కోరుతున్నారు. జీ-7 సమ్మిట్ లో తానీ విషయాన్ని ప్రస్తావిస్తానని, ముఖ్యంగా అమెరికాకు నచ్చజెబుతానని ఆయన అంటున్నారు. ఇలా ఈ రెండు అగ్ర దేశాలూ దాదాపు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కానీ తాలిబన్లు మాత్రం ఈ విధమైన ప్రతిపాదనను తాము అంగీకరించే ప్రసక్తి లేదని కుండబద్దలు కొడుతున్నారు. మరో వారం రోజుల్లో ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
ఆగస్ట్ 15 నుంచి 22 వరకు ఆయా దేశాలు కాబూల్ నుంచి తరలించిన దౌత్య అధికారులు, వారి కుటుంబీకులు, సాధారణ పౌరుల సంఖ్య 28,000 కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఎయిర్ పోర్ట్ కు భద్రత కల్పిస్తున్న బలగాల్లో అమెరికా- 6,000, బ్రిటీష్ – 900 మంది సైనికులతో పాటు టర్కీ, ఇతర నాటో దేశాల సైనికులు
ఆయా దేశాల తరలింపులు… అమెరికా 2,500(అమెరికన్లు), 17,000(ఇతరులు) యూకే 3,821 జర్మనీ 2000 పాకిస్తాన్ 1,100 ఇటలీ 1000 టర్కీ 583 ఫ్రాన్స్ 570 భారత్ 590 డోర్మార్క్ 404 నెదర్లాండ్స్ 300 ఆస్ట్రేలియా 300 కెనడా 294 స్పెయిన్ 273 పోలండ్ 260 చెక్ రిపబ్లిక్ 170 ఉక్రెయిన్ 83 హంగెరీ 26 ఇండోనేషియా 26 రుమేనియా 14 జపాన్ 12
మరిన్ని ఇక్కడ చూడండి: Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరు బర్త్ వేడుకల్లో మెగా బ్రదర్స్, అల్లు అరవింద్ ఫ్యామిలీ సందడి.. వీడియో వైరల్
Sarah Ali Khan: గ్లామర్ షోతో మతి పోగొడుతున్న సారా అలీఖాన్.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హల్‌చల్