Taliban Panjshir: తాలిబన్లకు కొరకరాని కొయ్యగా మారిన అందాల లోయ.. పంజ్‌షిర్‌ నుంచి సింహగర్జన..!

తాలిబన్లు చేసిన ప్రచార యుద్ధానికి అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతో సహా ప్రముఖులంతా దేశం విడిచి పారిపోయారు. అఫ్గానిస్థాన్‌ మొత్తం రాజీ పడినా.. ఇక్కడి నేతలు వెనక్కి తగ్గలేదు.

Taliban Panjshir: తాలిబన్లకు కొరకరాని కొయ్యగా మారిన అందాల లోయ.. పంజ్‌షిర్‌ నుంచి సింహగర్జన..!
Panjshir
Follow us

|

Updated on: Aug 23, 2021 | 8:08 PM

Taliban attack on Panjshir: తాలిబన్లు చేసిన ప్రచార యుద్ధానికి అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతో సహా ప్రముఖులంతా దేశం విడిచి పారిపోయారు. అఫ్గానిస్థాన్‌ మొత్తం రాజీ పడినా.. ఇక్కడి నేతలు వెనక్కి తగ్గలేదు. అఫ్ఘానిస్థాన్ వశం చేసుకున్న తాలిబన్లు తమకు తిరుగులేదనుకున్నారు. దేశాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు. అఫ్గాన్‌ సైన్యం కూడా ఏమాత్రం ప్రతిఘటించకుండా తాలిబన్లకు లొంగిపోయింది. దీంతో ఇంకా పేట్రేగిన తాలిబన్లు పంజ్ షీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు తాలిబన్లకు పంజ్ షీర్ భయం పట్టుకుంది. అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు తమను సవాలు చేస్తున్న పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు.

పంజ్ షీర్ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు యత్నించిన తాలిబన్లలో 300 మందిని స్థానిక సైన్యం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. పంజ్‌షీర్‌ సైన్యం ప్రకటించినట్లుగా 300 మంది తాలిబన్లు మృతి చెందారని, వందల మంది తాలిబన్లు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. బాగ్లాన్‌, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం చేసుకున్నట్లు పంజ్ షీర్ సైన్యం తెలిపింది. మరికొందరు తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపు కదులుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పలువురు తాలిబన్ కమాండర్లు తమ ఆధీనంలో ఉన్నట్లు పంజ్ షీర్ సైన్యం చెబుతోంది.

పంజ్‌షిర్‌ సింహంగా పేరున్న అహ్మద్‌ షా మసూద్‌ సంతానంలో పెద్దవాడు. స్కూల్‌ విద్య ఇరాన్‌లో పూర్తి చేసుకొన్నా.. సైనిక విద్య మాత్రం బ్రిటీష్‌ ఆర్మీకి చెందిన మిలటరీ అకాడమీ ఫర్‌ ఆఫీసర్స్‌లో పూర్తి చేశారు. 2015లో కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ అందుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌ నుంచి అంతర్జాతీయ రాజకీయాల్లో మాస్టర్స్‌ అందుకొన్నారు. 2001లో విలేకర్ల రూపంలో అల్‌ఖైదా ఉగ్రవాదులు ఆయన తండ్రి అహ్మద్‌ షా మసూద్‌పై ఆత్మాహుతి దాడి చేశారు. అప్పట్లో అహ్మద్‌ షా నార్తర్న్‌ అలయన్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. విద్యాభ్యాసం ముగించి పంజ్‌షిర్‌ చేరుకొన్న అహ్మద్‌ మసూద్‌ 2019లో అమెరికా దళాల ఉపసంహరణపై చర్చలు మొదలు పెట్టగానే భవిష్యత్తుపై ఆయన ఓ అంచనాకు వచ్చేశారు. శాంతి చర్చలు సరైన మార్గంలో లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. తండ్రి ప్రారంభించిన నార్తర్న్‌ అలయన్స్‌ బాటలోనే ‘ది నేషనల్‌ రెసిస్టన్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌’ను ప్రారంభించారు.

బైడెన్‌పై వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచేందుకు అహ్మద్‌ మసూద్‌ అమెరికా పత్రికలను ఎంచుకొన్నారు. ఇప్పటికే అడ్డగోలుగా బలగాల ఉపసంహరణతో బైడెన్‌ సర్కార్‌ అభాసుపాలైంది. 20 ఏళ్లుగా అమెరికన్‌ సైనికుల త్యాగాలను, ధనాన్ని ప్రభుత్వం బూడిదలో పోసిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు తాలిబన్ల వికృత చేష్టలు చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అఫ్గాన్లు తాలిబన్ల భయంతో విమానాలకు వేలాడటం.. వాటి పై నుంచి పడి చనిపోవడం వంటి వార్తలు దీనికి ఆజ్యం పోశాయి. ఈ సమయంలో పంజ్‌షిర్‌ నుంచి తాలిబన్లను ఎదుర్కొనేందుకు రెసిస్టన్స్‌ ఫోర్స్‌ ముందుకొచ్చి.. తమకు సాయం చేయమని అమెరికాను బహిరంగంగానే కోరింది. ఈ మేరకు మసూద్‌ వాషింగ్టన్‌పోస్టులో ఓప్‌ఎడ్‌ వ్యాసం రాయటం సంచలనం సృష్టించింది. 2001లో అమెరికాకు భారీగా సాయం చేసింది పంజ్‌షిర్‌ పోరాట యోధులే. ఇప్పుడు వారిని అమెరికా గాలికొదిలేస్తే దేశ ప్రజల ముందు బైడెన్‌ ఇమేజ్‌ ఘోరంగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది.

గుల్ముద్దీన్‌ హెక్మత్‌యర్‌ వంటి ముఠా నేతలు తాలిబన్ల ఎదుట తలవంచారు. కానీ, 1995లో పంజ్‌షిర్‌ లోయకు చెందిన అహ్మద్‌ షా మసూద్‌ ఒంటరిగా కాబుల్‌కు రెండు గంటల దూరంలోని తాలిబన్ల అడ్డా అయిన మదీన్‌ హషర్‌కు వెళ్లారు. ఆ సమయంలో అతను పూర్తి నిరాయుధుడు, ఒంటరిగా వచ్చాడు. అంతర్యుద్ధాన్ని ఆపేలా కొన్ని గంటలపాటు తాలిబన్లను ఒప్పించేందుకు ప్రయత్నించారు. చర్చలు విఫలం అయ్యాయి. నిరాశగా ఆయన తిరిగి కాబుల్‌ వచ్చారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మసూద్‌తో చర్చలు జరిపిన తాలిబన్‌ నాయకుడిని సహచరులే హత్య చేశారు. మసూద్‌ను ప్రాణాలతో పంపించినందుకే వారు ఈ ఘాతకానికి తెగబడ్డారు. ఈ ఘటన తర్వాత మసూద్‌ పంజ్‌షిర్‌కు చేరుకొని నార్తర్న్‌ అలయన్స్‌ ఏర్పాటు చేసి తాలిబన్లపై పోరాటం మొదలుపెట్టారు. 2001లో తాలిబన్లు, అల్‌ఖైదా ఉగ్రవాదులు కలిసి విలేకరుల రూపంలో మసూద్‌ను హత్య చేశారు. ఇదిలావుంటే, ఈ సారి అహ్మద్‌షా మసూద్‌ తనయుడు అహ్మద్‌ మసూద్‌ అసలు చర్చలకే మొగ్గు చూపడంలేదు. తాలిబన్లు మాత్రం ఇప్పటికే రష్యన్లను ఆశ్రయించి చర్చలకు తీవ్ర యత్నాలు చేస్తున్నారు.

అయితే.. కాబూల్ కు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పంజ్ షీర్ పై మాత్రం పట్టు సాధించలేకపోతున్నారు. ఇటీవల తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలెహ్ కూడా ఇదే ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నారు. అలాగే.. రక్షణ మంత్రి బిస్మిల్లా మొహ్మది, మరో నేత అహ్మద్ మసౌది కూడా ఇదే ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి తమ సత్తా చాటుతున్నారు. తాలిబన్లపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ రెబల్ గ్రూప్స్.. రెండు మూడు చోట్ల తాలిబన్లను హత్యచేసి.. ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పంజ్ షీర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు తాలిబన్లు.

ఇప్పటికే తమ ఫైటర్లు వేలాది మంది పంజ్ షీర్ ను చుట్టుముట్టారని తాలిబన్లు ప్రకటించారు. పంజ్ షీర్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఇస్లామిక్ ఎమిరేట్స్ కు చెందిన ముజాహిదిన్ లు దానిని చుట్టుముట్టారని చెప్పారు. అయితే, స్థానికంగా ఉన్న అధికారులు.. రాష్ట్రాన్ని తాలిబన్లకు అప్పగించేందుకు నిరాకరించడంతో.. తాలిబన్లకు, రెబల్స్ కు మధ్య ఎదురుదాడి మొదలైంది.

తాలిబన్లను ఎదుర్కునేందుకు పంజ్ షీర్ వారియర్లు రెడీ అవుతున్నారు. అహ్మద్ మసౌది నేతృత్వంలో స్థానిక యువతకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆఫ్గనిస్తాన్ లోని పలు ప్రాంతాల నుంచి గత ప్రభుత్వ హయంలోని పనిచేసిన బలగాలు.. పంజ్ షీర్ చేరుకుంటున్నాయి. తాలిబన్లను ఎదుర్కునేందుకు ఆయుధాలు సమకూర్చుకుంటున్నాయి. తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ లో ఎక్కువ రోజులు ఉండబోరని రెబల్ లీడర్స్ అంటున్నారు. వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.

Read Also…  Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపు రూ. 300 టికెట్ కోటాను రిలీజ్ చేయనున్న టీటీడీ.. ఏ సమయంలోనంటే

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..