AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బు కోసం కన్న కొడుకు వేధిస్తున్నాడని.. కిరాయి హంతకులకు రూ.9 లక్షలు సుపారీ ఇచ్చిన చంపించిన తండ్రి

కాలం మారే కొద్ది మనుషులు కసాయిల్లా మారుతున్నారు. రక్తసంబంధీకులనే కాదనుకుంటున్నారు. డబ్బుల కోసం వేధిస్తున్నాడని, ఓ తండ్రి కన్నకొడుకునే హత్య చేయించాడు.

డబ్బు కోసం కన్న కొడుకు వేధిస్తున్నాడని.. కిరాయి హంతకులకు రూ.9 లక్షలు సుపారీ ఇచ్చిన చంపించిన తండ్రి
Murder
Balaraju Goud
|

Updated on: Aug 23, 2021 | 7:22 PM

Share

Chittoor Police Chased Murder: కాలం మారే కొద్ది మనుషులు కసాయిల్లా మారుతున్నారు. రక్తసంబంధీకులనే కాదనుకుంటున్నారు. డబ్బుల కోసం వేధిస్తున్నాడని, ఓ తండ్రి కన్నకొడుకునే హత్య చేయించాడు. చిత్తూరు జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం కన్న కొడుకు గిరిబాబు వేధిస్తున్నాడన్న నెపంతో తండ్రి జయరామ్ సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు.

ఈనెల 17న చిత్తూరు జిల్లాలోని కేవీ పల్లి మండలం రెడ్డివారిపల్లిలో గిరిబాబు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు కొడవళ్లతో నరికి చంపారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం చేపట్టిన అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్న తండ్రి జయరామ్‌నే నిందితుడిగా తేల్చారు. తండ్రి జయరామ్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. కాగా, కొడుకు గిరిబాబును తానే హత్య చేయించినట్లు కసాయి తండ్రి అంగీకరించాడు. కొడుకు హత్య చేసేందుకు కిరాయి హంతకులతో తండ్రి జయరామ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం మర్డర్ గ్యాంగ్‌కు రూ. 9 లక్షల సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. కాగా, జయరాంతో పాటు సూపరీ హత్యలో నిందితుడైన మల్లికార్జున, చంద్రశేఖర్, వడ్డీ సురేష్ తో పాటు నలుగుర్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు.

Read Also… LIC Policy: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. రద్దయిన పాలసీలను పునరుద్దరించేందుకు ఆలస్య రుసుములో మినహాయింపు!

రష్యన్ నటి అలెగ్జాండ్రా జావి మృతిపై గోవా పోలీసుల దర్యాప్తు.. రష్యా కాన్సులేట్ అనుమతికై ఎదురుచూపులు

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్