రష్యన్ నటి అలెగ్జాండ్రా జావి మృతిపై గోవా పోలీసుల దర్యాప్తు.. రష్యా కాన్సులేట్ అనుమతికై ఎదురుచూపులు
ఉత్తర గోవాలోని తన అపార్ట్ మెంట్ లో విగత జీవిగా కనిపించిన 24 ఏళ్ళ రష్యన్ నటి అలెగ్జాండ్రా జావి మృతిపై గోవా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఇందుకు రష్యా కాన్సులేట్ అనుమతికోసం వేచి చూస్తున్న్నారు.
ఉత్తర గోవాలోని తన అపార్ట్ మెంట్ లో విగత జీవిగా కనిపించిన 24 ఏళ్ళ రష్యన్ నటి అలెగ్జాండ్రా జావి మృతిపై గోవా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఇందుకు రష్యా కాన్సులేట్ అనుమతికోసం వేచి చూస్తున్న్నారు. ‘కాంచన-3’తో సహా కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన ఈమె నార్త్ గోవాలోని సియోలిమ్ విలేజ్ లో గల తన ఫ్లాట్ లో ఉరి వేసుకుని కనిపించింది. ఈమె మృతదేహాన్ని మార్చ్యురీలో ఉంచామని..ఆటాప్సి కోసం రష్యన్ దౌత్యకార్యాలయ అనుమతికై వేచి చూస్తున్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఆ కార్యాలయం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందవలసి ఉందన్నారు. తాము అప్పుడే ఈమె బాయ్ ఫ్రెండ్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు ఆయన చెప్పారు. ఇదే ఫ్లాట్ లో ఈమెతో ఉంటున్న ఈమె బాయ్ ఫ్రెండ్ బయటకి వెళ్లిన సమయంలో ఈమె ఉరివేసుకున్నట్టు తెలుస్తోందన్నారు. అలెగ్జాండ్రా జావి మృతిలో చెన్నైకి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ పాత్ర ఉండవచ్చునని అనుమానిస్తున్నానని, అతడ్ని విచారించాలని ముంబైలోని రష్యన్ కాన్సులేట్ లో గల గోవా రిప్రజెంటేటివ్ విక్రమ్ వర్మ అనే అడ్వొకేట్..గోవా పోలీసులను కోరారు.
2019 లోనే తనను ఈ ఫోటోగ్రాఫర్ లైంగికంగా వేధిస్తున్నాడని అలెగ్జాండ్రా జావి పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన చెప్పాడు. ఆమెను అతడు వేధించడమే కాక..బ్లాక్ మెయిల్ కూడా చేసినట్టు తెలిసిందని, ఇందుకు ఆధారాలున్నాయని..ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అతడిని అరెస్టు చేయాలని ఆయన అభ్యర్థించాడు. ఈ కేసును రష్యన్ కాన్సులేట్ మానిటర్ చేస్తోందని.. దర్యాప్తులో గోవా పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన పేర్కొన్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: ”అఫ్గాన్ క్రికెటర్‌తో నిశ్చితార్ధం రద్దు చేసుకున్నా”.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ప్రకటన..
Bihar: లూజ్ హెయిర్‌తో కాలేజ్‌కి వస్తే అమ్మాయిలకు నో ఎంట్రీ.. ప్రిన్సిపల్ వివాదాస్పద ఉత్తర్వులు