AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: లూజ్ హెయిర్‌తో కాలేజ్‌కి వస్తే అమ్మాయిలకు నో ఎంట్రీ.. ప్రిన్సిపల్ వివాదాస్పద ఉత్తర్వులు

బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన సుందర్‌వతి మహిళా మహా విద్యాలయం ఒక విచిత్రమైన ఉత్తర్వును జారీ చేసింది. కాలేజీలో చదువుతున్న అమ్మాయిలకు డ్రెస్ కోడ్ మొదలుకొని అనేక పరిమితులు...

Bihar: లూజ్ హెయిర్‌తో కాలేజ్‌కి వస్తే అమ్మాయిలకు నో ఎంట్రీ.. ప్రిన్సిపల్ వివాదాస్పద ఉత్తర్వులు
Sm College Of Bhagalpur
Balaraju Goud
|

Updated on: Aug 23, 2021 | 6:27 PM

Share

College Principal Controversial orders: బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన సుందర్‌వతి మహిళా మహా విద్యాలయం ఒక విచిత్రమైన ఉత్తర్వును జారీ చేసింది. కాలేజీలో చదువుతున్న అమ్మాయిలకు డ్రెస్ కోడ్ మొదలుకొని అనేక పరిమితులను కళాశాల యాజమాన్యం అమలు చేస్తోంది. ప్రిన్సిపాల్ జారీ చేసిన ఉత్తర్వులో, కాలేజీకి ఏ విద్యార్థిని కూడా కళాశాలలకు వచ్చే విద్యార్థినులు ఖచ్చితంగా జడవేసుకోవాలి.. జుట్టు విరబూసుకుని రాకూడదు.. సెల్ఫీలు తీసుకోవడంపై నిషేధం విధించారు. అలాగే డ్రస్ కోడ్‌ను కూడా తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనను అమలు చేస్తున్నారు. బీహార్‌ రాష్ట్రంలోని ఓ మహిళా కళాశాల ఈ రకమైన ఆంక్షలు అమలు చేస్తోంది.కళాశాల ఆవరణలో యువతులు పక్కాగా జడ వేసుకుని కనిపించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, ఈ ఏడాది ఇంటర్‌లో చేరిన బాలికలకు ప్రత్యేక డ్రెస్ కోడ్ నిర్దేశించారు. కాలేజీ ఆవరణలో సెల్ఫీలు తీసుకోవడం కూడా నిషేధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమ్మాయిలు లూజ్‌ హెయిర్‌తో వస్తే వారిని కాలేజీలోకి అనుమతించబోమని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌. రమన్‌ సిన్హా స్పష్టం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం నిర్ణయంపై విద్యార్థినులు మండిపడుతున్నారు. సైన్స్, కామర్స్, ఆర్ట్స్‌ మూడు విభాగాలలో ప్రస్తుతం 1,500 మంది విద్యార్ధినులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్‌ కొత్త డ్రెస్‌ కోడ్‌ను నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ సూచించిన దుస్తులనే ధరించాలని కళాశాల యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. చలికాలంలో రాయల్ బ్లూ బ్లేజర్ లేదా చలికోటు ధరించాలని సూచించింది. వీటిని ఎవరైనా అతిక్రమించి డ్రెస్‌కోడ్‌ లేకుండా, జడ వేసుకోకుండా వస్తే అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలపై విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. ఇదో తుగ్లక్ నిర్ణయమని ఆర్జేడీ విద్యార్ధి విభాగం ధ్వజమెత్తింది.

అయితే, ఈ నిర్ణయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ సమర్ధించుకున్నారు. డ్రెస్ కోడ్‌పై ఉత్తర్వులు జారీచేశామని, వీటిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అంతేకాదు, దీనిపై మీడియా, కొంత మంది విద్యార్ధినులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. కానీ, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని ఆయన ఉద్ఘాటించారు.

Read Also….Karvy MD Parthasarathi: కార్వీ ఎండీ పార్థసారధి కేసులో తవ్వేకొద్ది వెలుగులోకి వస్తున్న పాపాల పుట్ట..!