AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karvy MD Parthasarathi: కార్వీ ఎండీ పార్థసారధి కేసులో తవ్వేకొద్ది వెలుగులోకి వస్తున్న పాపాల పుట్ట..!

కార్వీ ఎండీ పార్థసారధికి ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఆయనపై ఐసీఐసీఐ బ్యాంకు మరో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే అరెస్టయిన పార్థసారధిని వారం రోజు పాటు తమ కస్టడీకీ కోరుతూ సీసీఎస్‌ పోలీసుల పిటిషన్‌...

Karvy MD Parthasarathi: కార్వీ ఎండీ పార్థసారధి కేసులో తవ్వేకొద్ది వెలుగులోకి వస్తున్న పాపాల పుట్ట..!
Karvy Md Parthasarathi
Balaraju Goud
|

Updated on: Aug 23, 2021 | 5:56 PM

Share

Karvy MD Parthasarathi Fraud Case: కార్వీ ఎండీ పార్థసారధికి ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఆయనపై ఐసీఐసీఐ బ్యాంకు మరో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే అరెస్టయిన పార్థసారధిని వారం రోజు పాటు తమ కస్టడీకీ కోరుతూ నాంపల్లి కోర్టులో సీసీఎస్‌ పోలీసులు ప్రత్యేక పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు బెయిల్‌ మంజూరు చేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన బాధితులు పెద్ద ఎత్తున సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో మదుపరుల పెట్టుబడితో కలిపి రూ. 2 వేల కోట్లకు స్కాం పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేసి భారీగా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డ కార్వీ ఎండీ పార్థసారధి పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కస్టమర్ల షేర్లను వారికి తెలియకుండానే తనఖా పెట్టి బ్యాంకుల నుంచి పార్థసారధి రుణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా తీసుకున్న రూ.780 కోట్లు ఎగవేయడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెండు కేసులు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఒక కేసు పెట్టాయి. దీనికి తోడు తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు మరో ఫిర్యాదు చేసింది. దీంతో నాలుగు రోజుల క్రితం ఆయన్ని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

అంతేకాకుండా, పార్థసారధి మరో రూ.720 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. తిరిగి సొమ్ములు కట్టకుండా ఎగవేగవేయడంపై ఆయా బ్యాంకుల ఫిర్యాదు మేరకు పోలీసులు పార్థసారధిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా కార్వీ ఎండీ పార్థసారధిపై మరో కేసు నమోదైంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ చేసిన ఫిర్యాదుతో కేసు ఫైల్‌ చేశారు పోలీసులు.

మరోవైపు సీసీఎస్‌కు పార్ధసారథి బాధితులు ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. ఇక, పార్థసారథిని వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, బెయిల్‌ ఇవ్వరాదని కోరుతూ పార్థసారధి పిటిషన్‌కు కౌంటర్‌ దాఖలు చేశారు పోలీసులు.

కార్వీ అక్రమాలు గతంలోనే వెలుగులోకి రావడంతో ఆ సంస్థ బ్రోకింగ్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది సెబీ.. అప్పటికే కస్టమర్లు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌ చేశారు. ఈ నిషేధం కారణంగా బ్యాంకులు తామిచ్చిన రుణాలను రాబట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే కార్వీ ఎండీ పార్థసారధి మీద వరుగా కేసులు నమోదు కావడంతో అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆయనపై కేసులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.

Read Also….  Central Government: కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం.. మౌలిక వసతులను విక్రయించేందుకు రంగం సిద్దం..!