AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం.. మౌలిక వసతులను విక్రయించేందుకు రంగం సిద్దం..!

Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మౌలిక వసతులను..

Central Government: కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం.. మౌలిక వసతులను విక్రయించేందుకు రంగం సిద్దం..!
Subhash Goud
|

Updated on: Aug 23, 2021 | 5:46 PM

Share

Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మౌలిక వసతులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 6 లక్షల కోట్ల నిధులు సమీకరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగు పడేందుకు ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే కేంద్రం విక్రయించే జాబితాలో రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్ సరఫరా లైన్లు, గ్యాస్ పైప్‌లైన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ రోడ్‌ మ్యాప్‌ను ప్రకటించనున్నారు.

వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, కొన్ని కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రైవేటీకరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, పన్ను ఆదాయంలో కరోనా మహమ్మారి సమయంలో క్షీణించిన ఆర్థిక వ్యవస్థను భర్తీ చేయడానికి మార్చి 2022 వరకు ఈ విక్రయాలు జరపాలని భావిస్తోంది. అయితే మంత్రిత్వశాఖల ద్వారా మానిటైజింగ్‌ రోడ్ల ద్వారా వచ్చే ఆదాయం రూ.1.6 లక్షల కోట్లుగా అంచనా ఉంది. అలాగే రైల్వేల నుంచి రూ.1.5 లక్షల కోట్లు, విద్యుత్‌ రంగ ఆస్తులు రూ.లక్ష కోట్లు, గ్యాస్‌పైప్‌లైన్‌లు రూ.59వేల కోట్లు, టెలికమ్యూనికేషన్‌ ఆస్తులు రూ.40 వేల కోట్ల వరకు పొందవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా, గత ఏడాదికిపైగా కరోనా మహహ్మారి కారణంగా ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతోంది. మొదటి, రెండు దశల్లో ఆర్థికంగా బాగా కుంగిపోయింది. ఆ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పుడు థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలు ఉండటంతో ఆర్థికంగా మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇలాంటి విక్రయాల వల్ల మరింత ఆదాయం పెంచుకోవచ్చనే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం.

ఇవీ కూడా చదవండి:

Smart Prepaid Meters: స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయ్‌.. ముందే రీచార్జ్ చేసుకోవాలి.. లేదంటే క‌రెంటు ఉండ‌దు..!

Income Tax Refund: పన్ను చెల్లింపుదారులకు ఊరట.. రూ.50వేల కోట్ల రీఫండ్‌.. డబ్బులు వచ్చాయా.? లేదా తెలుసుకోండిలా!

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు